త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalwakuntla Kavitha | రేవంత్‌.. బుద్ధి తెచ్చుకో.. ఇక‌నైనా కొనుగోలు కేంద్రాల‌కు వెళ్లు: క‌విత

Kalwakuntla Kavitha | సీఎం రేవంత్‌రెడ్డి ఇక‌నైనా బుద్ధి తెచ్చుకొని కొనుగోలు కేంద్రాల‌కు వెళ్లాల‌ని, రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత సూచించారు. పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On May 22, 2026, 2.12 pm IST

Kalwakuntla Kavitha | రేవంత్‌.. బుద్ధి తెచ్చుకో.. ఇక‌నైనా కొనుగోలు కేంద్రాల‌కు వెళ్లు: క‌విత
Advertisement
  • ఈ స‌ర్కారుకు బుద్ధి రావాల‌ని స‌చివాల‌యం ముందు వ‌డ్లు పోసి నిర‌స‌న తెలిపాం
  • ఇది శాంపిల్ మాత్ర‌మే..
  • వాన‌లు ప‌డేలోపు వ‌డ్లు కొన‌కుంటే మీ మంత్రులను బ‌య‌ట తిర‌గ‌నివ్వం
  • సీఎం రేవంత్‌కు తెలంగాణ ర‌క్షణ సేన చీఫ్ క‌విత హెచ్చ‌రిక‌

Kalwakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఇక‌నైనా బుద్ధి తెచ్చుకొని కొనుగోలు కేంద్రాల‌కు వెళ్లాల‌ని, రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత సూచించారు. వ‌డ్ల కొనుగోళ్ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆమె పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి రాష్ట్ర స‌చివాల‌యం ముందు నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ‌లో తిర‌గ‌లేరు..

ఇవాళ సెక్రటేరియట్ ముందు వడ్లు పోసి నిరసన తెలిపాం. ఇది శాంపిల్ మాత్రమే.. వానలు పడేలోపే కొనుగోళ్లను పూర్తి చేయకపోతే తెలంగాణ రక్షణ సేన రంగంలోకి దిగుతుంది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇది మా హెచ్చరిక‌. రైతుల గోస పట్టని సర్కారుకు బుద్ధి రావాలని ఈ నిరసనకు పూనుకున్నాం. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలన్న సోయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని క‌విత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ గ్రేడ్‌గా చెప్తున్న‌రు..

మండుతున్న ఎండలతో రైతులు వడదెబ్బకు గురై కల్లాల్లోనే ఊపిరి వదులుతున్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు, జొన్నలను ఆరబెడుతూ కాంటా వేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. తూకంలో తరుగు తీస్తున్నారు. తేమ పేరిట కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ గ్రేడ్ గా చెప్తూ రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు అని ఆమె ఆవేద‌న చెందారు.

రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖను సమీక్షించని సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకుని ప్రత్యక్షంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు భరోసా కల్పించాలి అని క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Advertisement
Advertisement