SBI Employee Strike | బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా.. వరుసగా ఐదు రోజుల సెలవులకు బ్రేక్..
BI Employee Strike | ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మెకు (SBI Employee Strike) బ్రేక్ పడింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులు ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
SBI Employee Strike | త్రినేత్ర.న్యూస్: ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మెకు (SBI Employee Strike) బ్రేక్ పడింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగులు ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకింగ్ సేవలకు ప్రత్యామ్నాయంగా ఏటీఎం, కస్టమర్ సర్వీస్‌పాయింట్లు, యోనో, యూపీఐ వంటి ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని వినియోగదారులకు ఎస్‌బీఐ సూచించింది కూడా. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆలిండియా ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
దీంతో ఎస్‌బీఐ వరుస సెలవులకు బ్రేక్ పడింది. ఎందుకంటే సమ్మె తేదీకి ముందే నాలుగో శనివారం, ఆదివారం. ఒకవేళ ఈ సమ్మె జరిగినట్లయితే దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఐదు రోజుల పాటు నిలిచిపోయేవి. దీంతోపాటు సమ్మె ముగిసిన మరుసటి రోజైన మే 27న బక్రీద్ (ఈద్ అల్-అధా) సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా సుమారు 52 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు.
ఉద్యోగుల డిమాండ్లు..
సరైన సంఖ్యలో ఉద్యోగులు
మెసెంజర్లు
సాయుధ గార్డుల నియామకం
పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను ఎన్‌పీఎస్ ఉద్యోగులకు మార్చడం
బోర్డులో కార్మికుల ఉద్యోగి డైరెక్టర్‌ను నియమిండం
శాశ్వత ఉద్యోగాలను అవుట్‌సోర్సింగ్ చేయడం నిలిపివేయాలి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ●Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
- ●PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?
- ●Additional Collector | కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అదనపు కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..

Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..






