Telangana | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం
Telangana | ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలకు అనుమతి లేదంటూ జీవో నంబర్ 57ను ప్రభుత్వం విడుదల చేసింది.
Telangana | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలకు అనుమతి లేదంటూ జీవో నంబర్ 57ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆరు నెలల పాటు బదిలీలపై కఠిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రత్యేక పరిపాలనా అవసరాలు లేదా ప్రభుత్వ అనుమతితో జరిగే బదిలీలకు మాత్రం మినహాయింపులు ఉండే అవకాశం ఉంది. మే నెలలో బదిలీ పొందని ఉద్యోగులు తదుపరి సడలింపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇకపై ప్రమోషన్లు, పోస్టుల రద్దు, డెప్యుటేషన్లు, క్రమశిక్షణా చర్యలు, ఆరు నెలల కంటే ఎక్కువ దీర్ఘకాలిక సెలవుల నుండి తిరిగి వచ్చిన సందర్భాల్లో మాత్రమే బదిలీలకు అనుమతి ఉంటుంది. ఈ బదిలీలను కూడా కేవలం స్పష్టమైన ఖాళీలు ఉన్న స్థానాల్లోనే చేపట్టాలి తప్ప, ఇందుకోసం వేరే ఉద్యోగులను మార్చకూడదు. రాబోయే ఆరు నెలల వరకు బదిలీల సడలింపునకు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించదు. భవిష్యత్తులో ఏవైనా అత్యవసర బదిలీలు చేయాల్సి వస్తే ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి. అలాగే ప్రస్తుత స్థానంలో కనీసం ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మాత్రమే సరైన కారణాలతో, ఆర్థిక శాఖ అనుమతితో ఖాళీల్లో నియమించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించి బదిలీలు జరిగితే సదరు ఉద్యోగుల జీతాల బిల్లులను నిలిపివేస్తారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ ఏడాది మే 1న తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మే 1 నుంచి 31 వరకు బదిలీలకు అనుమతిస్తూ నాటి జీవోలో ప్రభుత్వం పేర్కొంది. నెల రోజుల గడువు ముగియడంతో సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం.

తాజావార్తలు
- ●Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!
- ●India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్
- ●Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!
- ●Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
- ●Supreme Court | సీబీటీ విధానం కుదరదు.. నీట్ రీ ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- ●HCA | హెచ్‌సీఏ నిధుల అక్రమాలపై సిట్ దర్యాప్తు.. త్వరలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్న సిట్..!

Vaibhav Suryavanshi | టీమిండియా జెర్సీలో వైభవ్ సూర్యవంశీ..? బీసీసీఐ కార్యదర్శి ఏమన్నారంటే..!

India US Trade Deal | భారత్-అమెరికా మెగా ట్రేడ్ డీల్ రెడీ: 99 శాతం చర్చలు పూర్తి.. త్వరలోనే గుడ్‌న్యూస్

Rashmika Mandanna | రష్మిక తగ్గేదేలే ... బాలీవుడ్ సినిమాకు నేషనల్ క్రష్ రెమ్యూనరేషన్ చూస్తే మైండ్ బ్లాకే!

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. రేపు పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!






