Sanath Nagar TIMS | సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్.. ఉదయం 9 నుంచి 11 వరకు ఓపీ సేవలు
Sanathnagar TIMS | హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నసమయం వచ్చేసింది. సనత్‌నగర్ నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Sanathnagar TIMS) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ (Trial Run) ప్రారంభం కానుంది.
Sanathnagar TIMS | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నసమయం వచ్చేసింది. సనత్‌నగర్ నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Sanathnagar TIMS) త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ (Trial Run) ప్రారంభం కానుంది. దీనికోసం ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని కూడా నియమించింది.
సుమారు నెల రోజుల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ (OP), డయాగ్నసిస్ సేవలను అందిస్తారు. వీటితోపాటు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్ , జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలతో సహా మొత్తం 22 విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ట్రయల్ రన్ ద్వారా దవాఖాన పనితీరును పరిశీలించి, త్వరలోనే పూర్తిస్థాయిలో వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించడానికి సర్కారు సన్నాహాలు చేస్తున్నది. గతేడాదే ఈ హాస్పిటల్‌ను ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యమైంది.
Trial Run at TIMS Sanathnagar from 1st May 2026.
OP services in 22 departments for one month
Minister Damodar Rajanarasimha directs officials
The government is making arrangements to launch the Telangana Institute of Medical Sciences (TIMS) at Sanathnagar. As per the…
— IPRDepartment (@IPRTelangana) April 30, 2026
సూపర్ స్పెషాలిటీ సేవలు..
ఉస్మానియా, గాంధీ దవాఖానపై రోగుల ఒత్తిడి తగ్గించేందుకు, తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరం నలుమూలలా నాలుగు దవాఖానల నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది. ఇందులో భాగంగా అల్వాల్‌లో న్యూరోసైన్సెస్, సనత్‌నగర్‌లో కార్డియాక్ సైన్సెస్, కొత్తపేటలో గ్యాస్ట్రో సైన్సెస్ విభాగాల్లో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ఈ టిమ్స్ (TIMS) హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తున్నది. ఈ దవాఖానల నిర్మాణం 2022లో ప్రారంభమైంది.
1000 పడకలు.. అత్యాధునిక వసతులు
ఇందులో భాగంగా సనత్‌నగర్‌లో 22.6 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్‌ను నిర్మించింది. ఇది మొత్తం నాలుగు బ్లాకుల్లో విస్తరించి ఉంది. కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా సేవలు అందించడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ముఖ్యంగా శస్త్ర చికిత్సల కోసం 16 ప్రధాన, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రం కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది.
ఇక రోగుల రికవరీ, క్లిష్టమైన కేసుల కోసం 300 పడకల సామర్థ్యంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) బ్లాక్, సాధారణ వార్డుల్లో 500 పడకలు, ప్రైవేటు, వీఐపీ వార్డులలో 200 పడకలు అందుబాటులోకి రానున్నాయి. రోగుల బంధువుల సౌకర్యార్థం దవాఖాన ప్రాంగణంలోనే 200 పడకల సామర్థ్యంతో ధర్మశాల సహా ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




