త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanath Nagar TIMS | స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌లో చోరీ.. కేసు న‌మోదు

Sanath Nagar TIMS | హైద‌రాబాద్‌లోని స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌( Sanath Nagar TIMS )లో చోరీ జ‌రిగింది. ఆస్ప‌త్రి అక‌డ‌మిక్ బ్లాక్ ఐదో ఫ్లోర్‌లోని మెటీరియ‌ల్ స్టోరేజ్ రూమ్‌లో చోరీ జ‌రిగిన‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది గుర్తించారు.

S

Hyderabad | Published On Sep 20, 2026, 12.49 pm IST

Sanath Nagar TIMS | స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌లో చోరీ.. కేసు న‌మోదు
Advertisement

Sanath Nagar TIMS | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని స‌న‌త్ న‌గ‌ర్ టిమ్స్‌( Sanath Nagar TIMS )లో చోరీ జ‌రిగింది. ఆస్ప‌త్రి అక‌డ‌మిక్ బ్లాక్ ఐదో ఫ్లోర్‌లోని మెటీరియ‌ల్ స్టోరేజ్ రూమ్‌లో చోరీ జ‌రిగిన‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది గుర్తించారు. దీంతో బోర‌బండ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. టిమ్స్‌కు చేరుకున్న పోలీసులు.. చోరీకి గురైన గ‌దిని ప‌రిశీలించారు. తాళం ప‌గుల‌గొట్టి విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్ప‌త్రికి సిబ్బంది ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. టిమ్స్ ఆస్ప‌త్రి ఇటీవ‌లే ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

Advertisement
Advertisement