IAS Transfers | తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. పలువురికి కీలక పోస్టులు..!
IAS Transfers | రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా పలువురు ఐఏఎస్, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక శాఖల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1740ను శుక్రవారం విడుదల చేసింది.
- హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఈవీ నరసింహారెడ్డి
- మున్సిపల్ శాఖ కార్యదర్శిగా సర్ఫరాజ్ అహ్మద్
IAS Transfers | రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా పలువురు ఐఏఎస్, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలక శాఖల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్‌టీ నంబర్ 1740ను శుక్రవారం విడుదల చేసింది. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి.. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా నియమించింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగాను అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఈవీ నరసింహారెడ్డిని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా బీ అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఆయన ఇన్వెస్ట్ తెలంగాణ, పరిశ్రమలు, వాణిజ్య విభాగం సీఈఓగానూ కొనసాగనున్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మయాంక్ మిట్టల్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కే చంద్రకళను హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ స్పెషల్ కలెక్టర్ (ఎల్‌ఏ) బాధ్యతలను అదనంగా అప్పగించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మనోజ్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేసింది. స్టేట్ ఆడిట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న పీ రామును విద్యాశాఖ స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా నియమించింది. వీ శ్రీనివాస్ రెడ్డిని మాతృశాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?
- ●RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన
- ●Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా - లవ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..
- ●Vaddiraju Ravi Chandra | మహిళలకు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
- ●Delimitation Bill 2026 | డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయాలపై కోర్టుల్లో సవాల్‌కు ఆంక్షలు..! కొత్త బిల్లులో కీలక నిబంధన
- ●Tummala Nageswara Rao | పామాయిల్ రైతులకు అండగా ప్రభుత్వం

Delimitation & Constitutional Imbalance | లోక్‌సభ సీట్ల పెంపు సరే .. మరి రాజ్యసభ సంగతేంది?

RIMS Incident | గర్భిణీ మృతి ఘటన.. రిమ్స్ వైద్యురాలికి ఉద్వాసన

Bigg Boss Mukesh Gowda | బిగ్‌బాస్ ముఖేష్ గౌడ తెలుగు సినిమా - లవ్‌స్టోరీతో హీరోగా ఎంట్రీ..

Vaddiraju Ravi Chandra | మహిళలకు, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి




