Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
Nursing Student | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) మృతి కలకలం సృష్టించింది. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె అనుమానాస్పద స్థితిలో (Suspicious Death) మరణించింది.
Nursing Student | త్రినేత్ర.న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) మృతి కలకలం సృష్టించింది. సెలవులకు ఇంటికి వచ్చిన ఆమె అనుమానాస్పద స్థితిలో (Suspicious Death) మరణించింది. ఆమె మృతదేహంపై గాయాలు ఉండటం, మెడకు చున్నీ బిగించిన ఆనవాళ్లు కనిపించడంతో దారుణానికి పాల్పడి హత్యచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జూలూరుపాడు మండలం వెంగన్నపాలేనికి (Vengannapalem) చెందిన ఇంద్రవెల్లి హరిణి (18) తనికెళ్ల సమీపంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో BSC Nursing ఫస్టియర్ చదువుతున్నది. తనికెళ్లలో హాస్టల్‌లో ఉంటున్న ఆమె.. సెలవుల నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చింది. సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లిన తల్లి రాజేశ్వరి.. కొద్దిసేపటికి తిరిగి వచ్చింది. హరిణి కనిపించకపోవడంతో వెతుకుతూ ఇంటి వెనుక భాగంలో చూడగా బాత్‌రూమ్ పక్కన సందులో విగతజీవిగా పడి ఉంది. దీంతో కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నుదుటి పైభాగంలో, ముక్కు కింద గాయాలైనట్లు, మెడును చున్నీతో బిగించిన ఆనవాళ్లను గుర్తించారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఇంటి ముందు తలుపులు మూసి ఉండగా, వెనుక తలుపు తెరచి ఉండటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాల కోసం ఇంటి పరిసరాల్లో క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈనేపథ్యంలో ఇది హత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పక్కింటి వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని మృతురాలి తల్లి రాజేశ్వరి ఆరోపిస్తున్నది.
సంబంధిత వార్తలు

Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్
సెప్టెంబర్ 22, 2026

Bhatti Vikramarka | జెన్కోకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి
జులై 24, 2026

NIMS BSc Nursing | నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు.. చివరి తేదీ జులై 11
జులై 2, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..
- ●Apple Mac Mini | యాపిల్ కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..
- ●2019 Easter bombings | 2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
- ●Jurala Project | ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం.. జూరాల నుంచి నీరు విడుదల..
- ●Stock Markets | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు.. మార్కెట్లకు స్వల్ప ఊరట..
- ●IIT Bombay | విద్యార్థి ఆత్మహత్య కేసు.. ప్రొఫెసర్‌ను సెలవుపై పంపిన ఐఐటీ బాంబే

Gold And Silver Prices Today | బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు.. జాగ్రత్త అంటున్న నిపుణులు..

Apple Mac Mini | యాపిల్ కొత్త మ్యాక్ మినీ, మ్యాక్ స్టూడియో వచ్చేశాయి.. ధరలు ఇవే..

2019 Easter bombings | 2019 ఈస్టర్ ఆత్మాహుతి దాడుల కేసు.. 15 మందికి 200 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

Jurala Project | ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం.. జూరాల నుంచి నీరు విడుదల..



