Farmhouse | పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి
Farmhouse | స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు (Birthday Party) వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ (Retired SI) సీ. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు.
Farmhouse | త్రినేత్ర న్యూస్: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు (Birthday Party) వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ (Retired SI) సీ. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఈ నెల 24న సాయంత్రం 7.30 గంటల సమయంలో కృష్ణ కౌండిన్య తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్ పుట్టినరోజు వేడుల్లో పాల్గొనేందుకు ఘట్‌కేసర్ పరిధిలోని ఏదులాబాద్‌లో ఉన్న లివిన్ ఫామ్‌హౌస్‌కు (Farmhouse) వెళ్లాడు.
అయితే ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసిన కృష్ణ కౌండిన్య స్నేహితులు.. అతడు అపస్మారక స్థితిలో పడిపోయాడని, తాము అతడిని ఘట్‌కేసర్ (Ghatkesar) ప్రభుత్వ దవాఖానకు తరలించామని వెల్లడించారు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు చేరుకోగా, అప్పటికే కృష్ణ కౌండిన్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి ప్రవీణ్ కుమార్ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా (Suspicious Death) కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ పుట్టినరోజు వేడుకల్లో ఏం జరిగింది? మరణానికి గల కారణాలు ఏమిటి? అనే కోణంలో ఆరాతీస్తున్నారు.
సంబంధిత వార్తలు

Nursing Student | సెలవులకు ఇంటికి వచ్చి.. అనుమానాస్పద స్థితిలో నర్సింగ్ విద్యార్థిని మృతి
సెప్టెంబర్ 23, 2026

Suspicious Death | ఓయో హోటల్‌కి వెళ్లిన జంట.. అర్ధరాత్రి యువతి మృతి.. ప్రియుడు పరార్
సెప్టెంబర్ 22, 2026

Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- ●Stock Markets | ముడిచమురు ధరల సెగ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Building Collapse | ఢిల్లీలో కుప్పకూలిన మరో భవనం.. ఇద్దరు మృతి
- ●Lula da Silva | బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా
- ●RTC Conductor | చిల్లర కోసం గొడవ.. కండక్టర్‌ను బస్సులోనుంచి తోసేసిన మహిళ
- ●Fake Death | హత్య కేసు నుంచి తప్పించుకోవడానికి.. ఏఐ సహాయంతో చనిపోయినట్లు డ్రామా..

Rain Update | అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Stock Markets | ముడిచమురు ధరల సెగ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Building Collapse | ఢిల్లీలో కుప్పకూలిన మరో భవనం.. ఇద్దరు మృతి

Lula da Silva | బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి.. మరోసారి అధికారంలోకి లూలా డా సిల్వా



