త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Marriage Refusal | ప్రేమ పేరుతో గ‌ర్భవ‌తిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం త‌క్కువ అన్నాడు..

Marriage Refusal | చిన్న‌ప్ప‌టి నుంచీ ఆమెకు పోలీస్ కావాల‌ని క‌ల‌. స‌ర్కార్ కొలువు కోసం క‌ష్ట‌ప‌డి శిక్ష‌ణ తీసుకుంది. అదే స‌మ‌యంలో ఇంటి ప‌క్క‌నే ఉండే కుర్రాడు (boyfriend) ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా (Love Affair) మారింది.

G

Telangana | Published On Nov 15, 2026, 12.04 am IST

Marriage Refusal | ప్రేమ పేరుతో గ‌ర్భవ‌తిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం త‌క్కువ అన్నాడు..
Advertisement

Marriage Refusal | త్రినేత్ర న్యూస్‌: చిన్న‌ప్ప‌టి నుంచీ ఆమెకు పోలీస్ కావాల‌ని క‌ల‌. స‌ర్కార్ కొలువు కోసం క‌ష్ట‌ప‌డి శిక్ష‌ణ తీసుకుంది. అదే స‌మ‌యంలో ఇంటి ప‌క్క‌నే ఉండే కుర్రాడు (boyfriend) ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా (Love Affair) మారింది. రెండేండ్లు ప్రేమించుకున్నారు. ఒక్క‌ట‌య్యారు. తీరా పెండ్లి చేసుకుందామ‌ని అడిగేస‌రికి అస‌లు బుద్ధి చూపించాడు. కులం త‌క్కువ అంటూ పెండ్లికి నిరాక‌రించ‌డంతో (Marriage Refusal) ఆమె ఆశ‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి. అవ‌మాన భారంతో ఆ యువ‌తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ (Mahabubabad) జిల్లా న‌డివాడ‌లో చోటుచేసుకుంది.

నడివాడకు చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతోపాటు కిరాణా దుకాణం నడుపుతూ కుమారస్వామి కుటుంబాన్ని పోషిస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన వారి పెద్ద కుమార్తె సుస్మిత (Sushmitha).. ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతుంది. పోలీసు అవ్వాల‌నే లక్ష్యంతో ప్ర‌స్తుతం మహబూబాబాద్‌లో పోలీసులు నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణకు (SI Aspirant) హాజరవుతున్న‌ది. ఈ క్ర‌మంలో ఇంటి పక్కనే ఉండే అనిల్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. తరుచూ ఆమెతో మాట్లాడేందుకు అనిల్‌ ప్రయత్నిస్తుండ‌టంతో తొలుత అనిల్‌ను దూరం పెట్టింది. తనకు ఈ ప్రేమ పెళ్లిళ్లపై నమ్మకం లేదని, అలాంటివి కుద‌ర‌వ‌ని స్ప‌ష్టం చేసింది. కానీ మాయ‌మాట‌ల‌తో ఆమెను నమ్మించిన‌ అనిల్‌.. ప్రేమించుకుందామని వెంటపడ్డాడు. ఇద్దరి కులాలు వేరని, పెండ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని చెప్పినా అతను వినలేదు. త‌న ఇంట్లో వాళ్లను ఒప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ క్ర‌మంలో ఆమె గర్భం దాల్చ‌డంతో.. త‌న‌కు సమయం కావాలంటూ గర్భస్రావం చేయించాడు.

మోసం చేశాడు.. వ‌దిలిపెట్టొద్దు..

పెండ్లి చేసుకుందామంటే దాట‌వేస్తూ వ‌స్తున్నాడు. అత‌నిపై అనుమానం వ‌చ్చిన సుస్మిత గ‌ట్టిగా నిల‌దీసింది. దీంతో తక్కువ కులం (Caste Differencess) అంటూ పెళ్లికి నిరాకరించాడు. మనస్థాపానికి గురైన సుస్మిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. తనను మోసం చేసిన నిందితుడుని వదిలిపెట్టొద్దంటూ 18పేజీల లేఖను ముందుగానే తల్లిదండ్రులకు రాసిపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనిల్‌తోపాటు అతని బంధువులే వచ్చి ఆమెను ఉరివేసి చంపారని సుస్మిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సుస్మిత రాసిన లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement