త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uday Nagaraju | తెలంగాణ వ్యక్తికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం.. కేటీఆర్ అభినందనలు

హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమించబడిన ఉదయ్ నాగరాజును తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ఉదయ్ నాగరాజు ప్రస్థానాన్ని కొనియాడారు. ఇంగ్లండ్ రాజు చేతుల మీదుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నామినేట్ అయినందుకు హృదయపూర్వక అభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. యూకేలో ఉదయ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం అన్నారు. ఇంకా మరిన్ని విజయాలను భవిష్యత్తులో సాధించాలని కేటీఆర్ కొనియాడారు.

J

Telangana | Published On Dec 11, 2025, 5.03 pm IST

Uday Nagaraju | తెలంగాణ వ్యక్తికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం.. కేటీఆర్ అభినందనలు
Advertisement

Uday Nagaraju | తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఉదయ్ నాగరాజుకు యూకేలో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు వ్యక్తి అయిన ఉదయ్ నాగరాజును ప్రపంచ ప్రసిద్ధ బ్రిటన్ పార్లమెంట్‌లో హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు నామినేట్ చేశారు. యూకే రాజు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ సూచన మేరకు యూకేలో స్థిరపడిన ఎన్ఆర్ఐ ఉదయ్‌ని హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్‌గా బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 2 నియమించారు. ఉదయ్ నాగరాజు ఆ పదవిలో జీవితంతాం ఉంటారు.

పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరుపు పోటీ

గత సంవత్సరం బ్రిటన్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరుపున ఉదయ్ పోటీ చేశారు. స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచారు.

యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసిన నాగరాజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేదాన్ని ముందే గుర్తించి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్‌ను ఉదయ్ స్థాపించారు.

దశాబ్ద కాలం నుంచి కిందిస్థాయి సమస్యలపై పోరాటం

ఉదయ్ నాగరాజుకు దశాబ్ద కాలం నుంచి క్షేత్రస్థాయి సమస్యలపై పట్టు ఉంది. స్కూల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ ప్రచారకుడిగా, ఇలా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు, అవసరాలపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. ఆయనకు వ్యాపారం, విద్య, రాజకీయం, ప్రజా పాలన, సంస్కృతి లాంటి అంశాలపై విశిష్ట అనుభవం ఉండటం వల్లనే ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

మీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం: కేటీఆర్

తాజావార్తలు

Advertisement