NRI BRS UK | తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే
NRI BRS UK | కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ (BRS) పార్టీ బలమైన పోరాటం చేస్తున్నదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే (NRI BRS UK) అధ్యక్షుడు నవీన్ రెడ్డి అన్నారు.
NRI BRS UK | త్రినేత్ర న్యూస్: కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ (BRS) పార్టీ బలమైన పోరాటం చేస్తున్నదని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే (NRI BRS UK) అధ్యక్షుడు నవీన్ రెడ్డి అన్నారు. పార్టీ పోరాటాలకు సంఘీభావంగా యూకేలోని ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యక్రమాలతో పాటు, రానున్న రోజుల్లో లండన్‌లో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్‌లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, యూకే వ్యాప్తంగా పనిచేస్తున్న కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పలువురు తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRIs) పార్టీలో చేరారు. వారికి అనిల్ కూర్మాచలం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యుడు శ్రీనాథ్ రెడ్డికి నివాళులర్పించారు.

అనంతరం అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) మాట్లాడుతూ.. గత 16 ఏండ్లుగా లండన్‌లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ ఎన్ఆర్ఐలు పార్టీకి అందిస్తున్న సేవలను నూతన సభ్యులకు వివరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీ నాయకత్వం ఎన్ఆర్ఐలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు.
యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ ఎన్నారైలు బీఆర్ఎస్‌లో చేరడం సంతోషకరమైన విషయమని మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతోనే పార్టీలో చేరుతున్నామని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని భావిస్తున్నామని నూతన సభ్యులు పేర్కొన్నారు.

అంకితభావంతో పనిచేస్తూ..
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కార్యకర్తలు క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు. అదే స్ఫూర్తి, క్రమశిక్షణతో భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలకు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించిన కేసీఆర్‌కు సంస్థ తరఫున ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రేతినేని రవి, సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కేవలం రాజకీయ వేదిక మాత్రమే కాదని, సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి ఉంటామని, ఏ సమస్య వచ్చినా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు.

భయపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
సోషల్ మీడియా కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతోందని పార్టీ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రజల తరఫున మరింత ఉత్సాహంతో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీకి అండగా నిలుస్తామని వెల్లడించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలను గణాంకాలతో సహా విశ్లేషిస్తూ ప్రశ్నిస్తున్నామని పార్టీ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘డైవర్షన్ పాలిటిక్స్’కు పాల్పడుతున్నారని యువజన విభాగం కన్వీనర్ ప్రశాంత్ మామిడాల విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ డ్రామాలను రానున్న రోజుల్లో ఎండగడతామన్నారు.

హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తాం..
ప్రజలకు అండగా నిలుస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మైనారికీ సెల్ నాయకుడు అబ్దుల్ జఫర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని ఎన్‌ఆర్‌ఐ బీఆర్ఎస్ యూకే యువజన విభాగం కో-ఆర్డినేటర్ అమరేశ్వరి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు రవి కుమార్ రేటినేని, సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్ల, గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యులు శ్రీధర్ రావు తక్కళ్ళపల్లి, ప్రవీణ్ వీర, కార్యదర్శులు అబూ జాఫర్, సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, రాజేష్ వర్మ, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, శివ గౌడ్, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, మెంబర్‌షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్, అమరేశ్వరి, లావణ్య, సాయి కిరణ్ కనుగుల, సాకేత్, జనార్దన్, స్నేహిత్ రావు, అనిల్ రాచమల్ల, సంకేత్ రెడ్డి, మణీందర్ రెడ్డి, శ్రీ హరి, జయపాల్ రెడ్డి, రాజు యాదవ్, అజయ్, రేవంత్, ప్రసన్న కుమార్, వికాస్ పర్రె, రాహుల్, మహేష్, అశ్వల్, శ్రీకాంత్, అస్లాన్, విజయ్, రమేష్ హర్షవర్ధన్, సతీష్ చంద్ర తదితర ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Gajjela Kantham | కోహినూర్లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు
అక్టోబర్ 5, 2026

Telangana Congress BC CM | బీసీ సీఎం హామీ ఓ డ్రామా: రేవంత్ రెడ్డి 2034 దాకా ఉంటానంటే కుర్చీ ఎలా ఇస్తారు?
అక్టోబర్ 5, 2026

Young India Integrated Schools | తెలంగాణలో లండన్, బర్మింగ్హామ్ లాంటి ఆరు అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్లు
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..
- ●Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్
- ●Gajjela Kantham | కోహినూర్లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు
- ●GST Council | జీఎస్టీ కౌన్సిల్లో కీలక ప్రతిపాదనలు.. వీటిపై పన్ను భారం తగ్గే ఛాన్స్..?
- ●Telangana Congress BC CM | బీసీ సీఎం హామీ ఓ డ్రామా: రేవంత్ రెడ్డి 2034 దాకా ఉంటానంటే కుర్చీ ఎలా ఇస్తారు?

Nobel Prize 2026 | మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..

Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్

Gajjela Kantham | కోహినూర్లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు



