YTPS | యాదాద్రికి బొగ్గు కొరత.. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
YTPS | దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) తీవ్ర బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిపడనంతా బొగ్గు సరఫరా లేకపోవడంతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం
ఇక నాలుగు రోజులకే నిల్వలు
ఆందోళనకరంగా పరిస్థితి
ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్‌పైనే ఆశలు
వైటీపీఎస్‌ను సందర్శించిన జెన్‌కో, దక్షిణ డిస్కం సీఎండీలు
YTPS | త్రినేత్ర న్యూస్ : దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) తీవ్ర బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిపడనంతా బొగ్గు సరఫరా లేకపోవడంతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఈ క్రమంలో విద్యుత్ కొరత కూడా తీవ్రమైంది.
వైటీపీఎస్‌లో మొత్తం 6 యూనిట్లు ఉండగా, 3, 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ప్రస్తుతం నాలుగు యూనిట్లు మాత్రమే పని చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నాలుగు యూనిట్లు కూడా పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. కనీసం 21 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి, ఒడిశాలోని నైని ప్రాంతాల నుంచి బొగ్గు సరఫరా కొనసాగుతున్నప్పటికీ, ఏ మాత్రం సరిపోయే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. మిగతా 4 యూనిట్లలోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.
మహానది కోల్‌ఫీల్డ్స్‌పైనే ఆశలు
సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు సరఫరా కాకపోవడం కూడా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఒప్పందం ప్రకారం అందించాల్సిన జీ9 గ్రేడ్ బొగ్గుకు బదులుగా జీ13 గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నారు. ఈ బొగ్గులో నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ప్రత్యామ్నాయంగా ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి ఐదు మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని గత నెలలో లేఖ రాసింది. ఇప్పటికే నిర్ణయించిన ధరకు బొగ్గు సరఫరా చేయడం కుదరదని, ధరలు పెంచితేనే బొగ్గు ఇవ్వడం సాధ్యమవుతుందని మహానది కోల్‌ఫీల్డ్స్ స్పష్టం చేసినట్లు సమాచారం.
వైటీపీఎస్‌ను సందర్శించిన జెన్‌కో సీఎండీ
ఈ పరిస్థితుల నేపథ్యంలో వైటీపీఎస్‌ను జెన్ కో సీఎండీ హరీశ్, దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేశ్ పాటిల్ సందర్శించారు. బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ల సాంకేతిక పరిస్థితి, ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరాపై అధికారులతో సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది.
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్





