Summer | రాబోయే మూడు రోజులు ఎండల్లేవు..!
Summer | గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ చల్లని కబురు అందించారు.
Summer | త్రినేత్ర.న్యూస్ : గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ చల్లని కబురు అందించారు. రాబోయే మూడు రోజుల పాటు అంటే మార్చి 11వ తేదీ వరకు ఎండల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మూడు రోజుల పాటు 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తూర్పు తెలంగాణ జిల్లాల్లో 36 నుంచి 37 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 34 - 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఇక మార్చి 9వ తేదీన ఉదయం 8.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 39.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 16.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
మార్చి 16 నుంచి వర్షాలు..!
మార్చి 16 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ఎండాకాలంలో మొదటి అర్ధ భాగంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తర్వాతి అర్ధ భాగంలో ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈసారి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



