Minister Uttamkumar Reddy | ఆర్డీఎస్, తుంగభద్ర జలాల్లో హక్కులపై రాజీ లేదు : ఉత్తమ్ కుమారెడ్డి
Minister Uttamkumar Reddy | రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుంగభద్ర డ్యామ్ జలాల వినియోగంలో తెలంగాణ హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Minister Uttamkumar Reddy | రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుంగభద్ర డ్యామ్ జలాల వినియోగంలో తెలంగాణ హక్కుల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్డీఎస్, తుంగభద్ర జలాల అంశాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్డీఎస్‌లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ హక్కులను అన్ని వేదికలపై బలంగా వినిపించాలని అధికారులను ఆదేశించారు. తుంగభద్ర నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్షించిన మంత్రి, ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల తెలంగాణ రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
కృష్ణా పరీవాహక ప్రాంత రైతుల సాగు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రిబ్యునల్స్, బోర్డులు, అంతర్రాష్ట్ర సమావేశాల్లో తెలంగాణ వాదనను మరింత బలంగా వినిపించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి, రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం అన్ని వేదికలపై పోరాడుతుందని వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది
- ●Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!
- ●Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...
- ●Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ
- ●Koppula Eshwar | అడ్లూరి.. నీ సవాల్ మాకు ఓకే.. టైమ్, డేట్ చెప్తే ఆధారాలతో వస్తం
- ●India UAE Defence Deal | ఇండియన్ వెపన్స్‌పై కన్నేసిన యూఏఈ: 'బ్రహ్మోస్', 'ఆకాశ్ తీర్' కోసం ముమ్మర చర్చలు

Methuku Anand | ఇది పల్లీ బఠాణీల కేబినెట్‌లా మారింది

Elephant poop | ఏనుగు పేడతో కాఫీ.. తయారీ విధానం, ధర తెలిస్తే షాకే..!

Darshan | ఓటీటీలోకి కన్నడ హీరో దర్శన్ లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ - హీరోనే విలన్...

Singareni | సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. రూ. కోటిన్నర వరకు బీమా రక్షణ







