త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saudi Arabia Vs Spain | స్పెయిన్ చేతిలో సౌదీ అరేబియా చిత్తు

Saudi Arabia Vs Spain | ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన 38వ మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత ప్రదర్శనతో సౌదీ అరేబియాను 4-0 తేడాతో చిత్తు చేసింది. అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

P

Sports | Published On Jun 22, 2026, 2.57 pm IST

Saudi Arabia Vs Spain | స్పెయిన్ చేతిలో సౌదీ అరేబియా చిత్తు
Advertisement
  • 4-0 స్కోర్ తేడాతో ఘ‌న విజ‌యం
  • విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించిన య‌మాల్‌, మైఖేల్‌
  • స్పెయిన్ ఓన్‌గోల్‌
  • రౌండ్ 30కి చేరువైన జ‌ట్టు

Saudi Arabia Vs Spain | ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన 38వ మ్యాచ్‌లో స్పెయిన్ అద్భుత ప్రదర్శనతో సౌదీ అరేబియాను 4-0 తేడాతో చిత్తు చేసింది. అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. యువ సంచలనం లామిన్ యమాల్, సీనియ‌ర్ ఫార్వర్డ్ మైఖేల్ ఓయార్జబల్ జట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే స్పెయిన్ దూకుడు ప్రదర్శించింది. 10వ నిమిషంలో మైకెల్ ఓయార్జబల్ అందించిన అద్భుత పాస్‌ను లామిన్ యమాల్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. వరల్డ్ కప్‌లో యమాల్‌కు ఇదే తొలి గోల్ కావడం విశేషం.

ఓయార్జబల్ డబుల్‌తో ఆధిక్యం పెంపు

మొదటి గోల్ అనంతరం కూడా స్పెయిన్ అటాక్‌ను కొన‌సాగించింది. 21వ నిమిషంలో కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఓయార్జబల్ సమీపం నుంచి బంతిని నెట్‌లోకి పంపి స్కోరును 2-0కు చేర్చాడు. ఆ తర్వాత కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే మరోసారి మెరిసిన అతను.. 24వ నిమిషంలో డానీ ఓల్మో హెడ్డర్‌ను అద్భుత వాలీతో గోల్‌గా మలిచి రెండో గోల్ వేశాడు. దీంతో తొలి అర్ధభాగంలోనే స్పెయిన్ 3-0తో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన వెంటనే సౌదీ అరేబియా పరిస్థితి మరింత క్లిష్టమైంది. 49వ నిమిషంలో హసన్ అల్‌తంబక్తి చేసిన ఓన్‌గోల్ కార‌ణంగా స్పెయిన్ ఖాతాలో నాలుగో పాయింట్ చేరింది. మార్క్ కుకురెల్లా కొట్టిన షాట్‌ను గోల్‌కీపర్ అడ్డుకున్నప్పటికీ, తిరిగి వచ్చిన బంతి అల్‌తంబక్తిని తాకి నెట్‌లోకి వెళ్లింది. దీంతో స్పెయిన్ ఆధిక్యం 4-0కు చేరుకుంది.

స్పెయిన్ పూర్తి ఆధిపత్యం

మ్యాచ్ మొత్తం స్పెయిన్ ఆటగాళ్లు మిడ్‌ఫీల్డ్, అటాకింగ్ విభాగాల్లో అద్భుత సమన్వయంతో ఆడారు. మరోవైపు సౌదీ అరేబియా ఒక్కటంటే ఒక్క కీలక అవకాశాన్ని కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. అన్ని విభాగాల్లో ప్రత్యర్థిపై పైచేయి సాధించిన స్పెయిన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ బ‌రిలో నిలిచింది.

Advertisement
Advertisement