త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భ‌రోసా.. ఆ మెసేజ్‌లు స‌ర్కారు వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం: నిరంజన్ రెడ్డి

Niranjan Reddy | ఈ ప్ర‌భుత్వంలో రైతు భ‌రోసా ఒక డ్రామాగా మారింద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Niranjan Reddy) విమ‌ర్శించారు. ప్రభుత్వానికి తెలియకుండా దాదాపు 3 లక్షల మంది రైతులకు రైతుభరోసా (Rythu Bharosa) వారి ఖాతాల్లో జమ అయినట్లు సందేశాలు వెల్లడం ఈ సర్కారు వైఫల్యానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Nov 5, 2026, 2.42 pm IST

Niranjan Reddy | డ్రామాగా మారిన రైతు భ‌రోసా.. ఆ మెసేజ్‌లు స‌ర్కారు వైఫ‌ల్యానికి నిద‌ర్శ‌నం: నిరంజన్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర న్యూస్‌: ఈ ప్ర‌భుత్వంలో రైతు భ‌రోసా ఒక డ్రామాగా మారింద‌ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి (Niranjan Reddy) విమ‌ర్శించారు. ప్రభుత్వానికి తెలియకుండా దాదాపు 3 లక్షల మంది రైతులకు రైతుభరోసా (Rythu Bharosa) వారి ఖాతాల్లో జమ అయినట్లు సందేశాలు వెల్లడం ఈ సర్కారు వైఫల్యానికి నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. భూభారతి పేరుతో రైతుల భూములను నిషేధిత జాబితాలోకి నెట్టారని, ఇప్పుడు రైతుల ఖాతాల వివరాలు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పెట్టారని ధ్వ‌జ‌మెత్తారు. రైతుభరోసా సందేశాలు తాము పంపలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గుతో తల దించుకోవాల్సిన అంశమ‌ని చెప్పారు. ఈ యాసంగికి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందో.. లేదో స్పష్టం చేయాల‌న్నారు. కరువు నేపథ్యంలో రైతులకు అందించే సహాయం గురించి ప్రకటన చేయాల‌ని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పాలనలో తలెత్తి, మీసం మెలేసిన రైతన్న నేడు సర్కార్ సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 10 నెలల ముందు నుంచే శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ఎల్ నినో (El Nino) ప్రభావం గురించి హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేద‌ని విమ‌ర్శించారు. పక్క రాష్ట్రాలు ఎల్ నినో ఎదుర్కొనేందుకు సిద్ధమైతే, తెలంగాణ మాత్రం నిద్రపోయింద‌న్నారు. కాళేశ్వరం, దేవదుల, కల్వకుర్తి, కన్నేపల్లి వంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను 24 గంటలు నడపకుండా రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేశార‌ని ఆరోపించారు. గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లిపోయింద‌ని, కృష్ణా నీళ్లు ఆంధ్రాకు వెళ్లిపోయాయ‌న్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో నాలుగు రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశార‌ని, ఫలితంగా తెలంగాణ రైతుల పొలాలు ఎండిపోయాయని చెప్పారు.

రాజకీయ కక్షతో పడావు పెట్టారు..

గోదావరిలో వందల టీఎంసీల‌ నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోతలను సరి చేయకుండా కేవలం రాజకీయ కక్షతో పడావు పెట్టార‌ని విమ‌ర్శించారు. ఇప్పటికీ నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉన్నా మోటార్లు ఆన్ చేయడం లేద‌న్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడం కన్నా ఇసుకతో జేబులు నింపుకోవడం మీదనే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. బొగ్గు నిల్వలు సరిగా ఉంచకపోవడం, ముందుగా విద్యుత్ కొనుగోలు చేయకపోవడం వల్ల కీలక సీజన్‌లో కరెంటు కోతలు విధించార‌ని తెలిపారు. 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేశారన్నారు. ట్యాంకర్లు, జనరేటర్లు రైతుల పంటలను కాపాడలేక పోయాయ‌ని చెప్పారు.

ప్ర‌క‌ట‌న‌చేసి చేతులు దులుపుకున్నారు..

పత్తి, వరి, మొక్కజొన్న, కందులు వంటి పంటలు దాదాపు 28 లక్షల ఎకరాల్లో ఎండిపోయాయ‌న్నారు. ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడంలోనూ, పరిహారం ఇవ్వడంలోనూ విఫలమైంద‌ని చెప్పారు. కేవలం కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుంద‌ని విమ‌ర్శించారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఒక్క చుక్క కూడా సాగునీరు ఉండద‌ని సీఎం (Revanth Reddy) స్వయంగా చెప్పడం, రైతులను పంట వేయకండని చెప్పడం, ఈ ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం విషయంలో చేతులు ఎత్తేసినట్లు అర్దం అవుతుంద‌న్నారు.

నీటి కొరతను సాకుగా చూపి..

తాగునీటికి ప్రాధాన్యం అంటూ సాగును నిర్లక్ష్యం చేశార‌ని మండిప‌డ్డారు. నీటి కొరతను సాకుగా చూపి సాగును పూర్తిగా వదిలేశార‌ని చెప్పారు. పక్క రాష్ట్రాలు నీటిని సరిగా నిర్వహించి పంటలు కాపాడుకున్నాయన్నారు. నీరు ఇవ్వకపోవడం ద్వారా పంటలు వేయకుండా చేసి, యూరియా సరఫరా, రైతుభరోసా, పంటల కొనుగోళ్లు, గిట్టుబాటు ధ‌ర‌, పంటలకు బోనస్ బాధ్యతల నుంచి తప్పించుకుంటుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం సకాలంలో కరెంటు, సాగునీరు ఇవ్వకపోవడం మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.50 వేల కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లింద‌న్నారు.

బాధ్యత లేని ప్రభుత్వం..

సమస్యలను అధికారులపై నెట్టడం, ఎల్‌నినోను సాకుగా చూపడం, రైతులను పంట వేయవద్దు అని చెప్పి తప్పించుకోవడం వ్యవసాయ రంగం, రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని స్పష్టం అవుతుంద‌ని చెప్పారు. ఇది ప్రకృతి విపత్తు కాద‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)సృష్టించిన విపత్త‌ని విమ‌ర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాద‌ని.. కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిప‌డ్డారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం సృష్టించిన ఇది మానవ నిర్మిత కరువని ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement