త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని రేవంత్ రెడ్డి.. మూడేండ్ల‌లో రెండు పిల్ల‌ర్ల‌కు మ‌ర‌మ్మ‌తులు కూడా చేయ‌లే: జీవ‌న్ రెడ్డి

Jeevan Reddy | మేడిగడ్డ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరగ‌డంతోనే తుమ్మిడి హట్టిపై సీఎం రేవంత్ నిద్రలేచినట్టు నటిస్తున్నారని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) విమ‌ర్శించారు. మహారాష్ట్ర సీఎంతో అపాయింట్‌మెంట్ కోసం మూడు నెలలు వృధా చేశారని మండిప‌డ్డారు.

G

Telangana | Published On Nov 4, 2026, 12.11 pm IST

Jeevan Reddy | తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని రేవంత్ రెడ్డి.. మూడేండ్ల‌లో రెండు పిల్ల‌ర్ల‌కు మ‌ర‌మ్మ‌తులు కూడా చేయ‌లే: జీవ‌న్ రెడ్డి
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర న్యూస్‌: మేడిగడ్డ మరమ్మతుల కోసం ఒత్తిడి పెరగ‌డంతోనే తుమ్మిడి హట్టిపై సీఎం రేవంత్ నిద్రలేచినట్టు నటిస్తున్నారని బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) విమ‌ర్శించారు. మహారాష్ట్ర సీఎంతో అపాయింట్‌మెంట్ కోసం మూడు నెలలు వృధా చేశారని మండిప‌డ్డారు. తుమ్మిడిహ‌ట్టిపై డీపీఆర్ లేకుండానే చర్చలకు ఎందుకు పోయార‌ని ప్ర‌శ్నించారు. ఇదంతా కాలయాపన కోసమే చేస్తున్నార‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ‌కు శ‌నిలా దాపురించాడ‌న్నారు. హైద‌రాబాద్ తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ నేత డాక్టర్ కురువ విజయ్ కుమార్‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహ‌ట్టి ప్రాజెక్టుకుతో ముంపునకు సంబంధించి మహారాష్ట్ర జాయింట్ అకౌంట్‌లో డబ్బులు వేస్తారట అని ఎద్దేవా చేశారు.

ఎల్‌నినోను ఎదుర్కొన‌డంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Govt) దృష్టి పెట్టలేదని విమ‌ర్శించారు. కరువును ఎదుర్కునే కార్యచరణ లేదని మండిప‌డ్డారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వ‌ద్ద‌ 20వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంద‌ని చెప్పారు. సీపిడబ్ల్యుఆర్‌ఎస్ రిపోర్ట్‌ను పక్కన పెట్టార‌ని వెల్ల‌డించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయమని మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేద‌న్నారు. ఒక్క టీఎంసీ నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేద‌ని చెప్పారు. తాత్కాలిక వ్యూహం కింద పనులు చేపట్టాల‌ని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులకు ఇది అడ్డంకి కాద‌న్నారు. అన్నారం సుందిళ్ల గోదావరి మీద ఉన్నాయ‌ని, మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు ప్రాణహిత మీద ఉంద‌ని చెప్పారు. అన్నారం, సుందిళ్ల ఆన‌క‌ట్ట‌లు సురక్షితంగానే ఉన్నాయ‌ని, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసినా వాటికి నష్టం లేద‌న్నారు. 150 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే వీలున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న‌ద‌ని విమ‌ర్శించారు.

ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం..

రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో ఆయనకే అర్థం కావడం లేద‌న్నారు. ఆర్‌ఆర్ టాక్స్ మీద ఉన్న శ్రద్ధ నీళ్లు ఎత్తిపోయడంలో లేదని మండిప‌డ్డారు. తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లాలో ఇసుక బస్తాలు అడ్డం పెట్టి నీళ్లను ఆపుతున్నార‌ని చెప్పారు. ఆ సోయి కన్నెపల్లి విషయంలో ఎందుకు లేద‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కరువు (Draught) సహాయక చర్యలు శూన్యమ‌ని విమ‌ర్శించారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింద‌న్నారు. సీఎం, మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా సాయం ఏమైందని ప్ర‌శ్నించారు. జాబ్ కార్డులు ఉన్న వారికి రూ.12 వేల చొప్పున సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం వినియోగ దారుల గురించి కూడా ఆలోచించాల‌న్నారు. నిత్యావసరాల ధరలు అదుపులో లేవని చెప్పారు.

అప్పుడే తుమ్మిడిహట్టి మొదలుపెట్టి ఉంటే..

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లను ఆన్అండ్ ఆఫ్‌లో విడుదల చేస్తారని మంత్రి తుమ్మలకు తెలియదా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడ‌ని మండిప‌డ్డారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే తుమ్మిడి హట్టి (Tummidihutti) మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి పూర్తి అయ్యేదని చెప్పారు. ఆల్మట్టిపై కర్ణాటక అనుసరించిన వ్యూహాన్నే తుమ్మిడి హట్టిపై తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల‌న్నారు. తుమ్మిడి హట్టికి 152 మీటర్ల వద్ద శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాల‌న్నారు. తర్వాత ఎంత ఒప్పందం కుదిరితే దానికి కట్టుబడాల‌న్నారు.

కేసీఆర్ (KCR) మూడేండ్ల‌లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు. ఈ మూడేండ్లలో రేవంత్ రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. యాసంగి పంటపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రేవంత్ కంటే పెద్ద ఆలోచనాపరుడ‌ని చెప్పారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను (Kannepally Pump House) తక్షణమే వాడుకుని రైతులను ఆదుకోవాలన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో చెప్పాల‌న్నారు. కరువులో అన్ని వర్గాలకు భరోసా ఇవ్వాల్సిన భాద్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంద‌ని చెప్పారు.

ట్యాగ్స్:

DraughtEl NinoJeevan ReddyKannepally Pump HouseMedigaddaRevanth ReddyTummidihutti
Advertisement
Advertisement