Intermediate | అకౌంట్స్, కామర్స్ కాంబినేషన్‌తో.. ఇంటర్‌లో కొత్త కోర్సు
Intermediate | ఇంటర్ (Intermediate).. విద్యార్థుల భష్యత్తుకు అనుసంధానకర్త. ఇక్కడ ఎంపిక చేసుకునే కోర్సును బట్టే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సాధారణంగా ఇంటర్ అనగానే మనకు ఎంపీసీ, బైపీసీ టక్కున గుర్తొస్తాయి.
Intermediate | త్రినేత్ర.న్యూస్: ఇంటర్ (Intermediate).. విద్యార్థుల భష్యత్తుకు అనుసంధానకర్త. ఇక్కడ ఎంపిక చేసుకునే కోర్సును బట్టే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సాధారణంగా ఇంటర్ అనగానే మనకు ఎంపీసీ, బైపీసీ టక్కున గుర్తొస్తాయి. వీటికితోడు ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి పోటీగా మరో కోర్సు (New Course) రాబోతున్నది. మ్యాథ్స్, సైన్స్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశా కల్పించే లక్ష్యంతో అకౌంట్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులతో కలిపి ఏసీఈ (ACE) అనే కొత్త కోర్సును వచ్చే విద్యాసంవత్సరం (2026-27) నుంచి ఇంటర్ బోర్డు ప్రారంభించనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలలో ఇది అందుబాటులోకి రానుంది.

ఈ కోర్సు చదివే విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఉంటాయని, డిగ్రీలో కామర్స్ గ్రూపులో చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే డిగ్రీలో బీకాం, బీబీఏ, బీఏలలో చేరవచ్చు. అనంతరం ఎంబీఏ, ఎంసీఏలతో పీజీ చేయవచ్చు. లేదా సీఏ కోర్సు చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఈసీ గ్రూప్ కనుమరుగు కానుంది. ఎంఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రెండో ఏడాది యథావిధిగా చదువుకోవచ్చని అధికారులు తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



