MP Raghunandan Rao | జంతర్‌మంతర్ వద్ద ఫొటోల కోసమే విపక్షాల ధర్నాలు
MP Raghunandan Rao | నీట్ లీక్ బాధాకరమని.. దానిపై సమగ్ర సమాధానం ఇస్తామని బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. నీట్‌తో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలు నిబంధనల ప్రకారమే జరుగుతాయని.. విపక్ష సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా జరగవని స్పష్టం చేశారు.
- ఫొటోల కోసమే విపక్ష సభ్యుల ఆందోళనలు
- ప్రతి సమస్యపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది
- బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
MP Raghunandan Rao | త్రినేత్ర.న్యూస్: నీట్ లీక్ బాధాకరమని.. దానిపై సమగ్ర సమాధానం ఇస్తామని బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. నీట్‌తో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాలు నిబంధనల ప్రకారమే జరుగుతాయని.. విపక్ష సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా జరగవని స్పష్టం చేశారు. జంతర్ మంతర్‌కు వెళ్లి ధర్నాలు చేసి ఫొటోలు దిగడం కోసమే విపక్షాలు సభను వాయిదా వేయిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. అయోధ్య రామమందిర విరాళాలకు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.
నీట్ లీక్ అంశంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర సమాధానం ఇస్తాం. గతంలో జరిగిన పేపర్ లీక్‍లపై ఎవరైనా రాజీనామా చేశారా? నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించాం.. పరీక్ష ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ముట్టడికి పిలుపునిస్తే ఏ ప్రభుత్వమైనా నిరసనకారులను పార్లమెంట్ వరకు రానిస్తుందా? ఆందోళనకారులను పార్లమెంట్ వరకు రాకుండా ఆపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని ఆయన అన్నారు.
నీట్ అంశంపై చర్చించడానికి స్పీకర్ అంగీకరించారు. అయినా ఇప్పుడే చర్చ జరగాలని, జీరో అవర్ రద్దు చేసి చర్చపెట్టాలని అడగడం ఏంటి? నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమాలకు పాల్పడే ఎగ్జామ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం అని స్పష్టం చేశారు.
అయోధ్య విరాళాల చోరీతో బీజేపీకి సంబంధం లేదు. ఈ చోరీ కేసుపై సిట్ సమగ్ర విచారణ చేస్తోంది. ఆలయంలో పని చేస్తున్న ఓ వ్యక్తి చేసిన పనికి బీజేపీని నిందిస్తే ఎలా? ఆర్ఎస్ఎస్‌కు ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ప్రతి సంస్థలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బీజేపీపై విపక్షాలు దష్ప్రచారం చేస్తున్నాయి అని ఎంపీ రఘునందన్ ఆరోపించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






