N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
N Ramchander Rao | ప్రపంచానికి భారతదేశం అందించిన శాశ్వతమైన నాగరికతా బహుమతి యోగా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (N Ramchander Rao) అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) దూరదృష్టి, కృషితో యోగా నేడు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందని చెప్పారు.
N Ramchander Rao | త్రినేత్ర.న్యూస్: ప్రపంచానికి భారతదేశం అందించిన శాశ్వతమైన నాగరికతా బహుమతి యోగా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (N Ramchander Rao) అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) దూరదృష్టి, కృషి వల్ల యోగా నేడు ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారిందని చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న యోగ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్. రామచందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచం జరుపుకుంటున్నదన్నారు. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సమాజ శ్రేయస్సుకు యోగా ఒక గొప్ప మార్గమని వెల్లడించారు.
స్వస్థ్ భారత్ నిర్మాణానికి యోగా బలమైన పునాది అని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా 24 గంటల కౌంట్‌డౌన్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అభినందించారు.

జూన్ 21నే ఎందుకు..
ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Day of Yoga) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భారతదేశం అందించిన ప్రాచీన సంప్రదాయమైన యోగా గొప్పతనాన్ని, అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలను ప్రపంచానికి చాటిచెప్పడమే యోగా డే ముఖ్య ఉద్దేశం. 2014 సెప్టెంబర్ 27న ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి (UN) సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనిని పరిశీలించిన ఐరాస 2014 డిసెంబర్ 11న జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి 175 దేశాలు మద్దతు పలికాయి. దీంతో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు.

ఉత్తరార్ధగోళంలో జూన్ 21న అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం (Summer Solstice) ఉంటుంది. యోగ సంప్రదాయంలో ఈ కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రోజును యోగా దినోత్సవంగా ఎంచుకున్నారు.
సంబంధిత వార్తలు

PM Modi | గత ఐదేండ్లలో ప్రధాని మోదీ ప్రకటనల ఖర్చు రూ.2,586 కోట్లు..
జూన్ 20, 2026

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి బహుమతిగా ‘పోచంపల్లి సిల్క్ స్టోల్’.. అందజేసిన ప్రధాని మోదీ
జూన్ 19, 2026

Cockroach Janta Party | బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వండి.. నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రధాని మోదీకి కాక్రోచ్ పార్టీ లేఖ
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత
- ●UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్
- ●Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ
- ●NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమేంటి..?
- ●NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్టీఏ ఏమన్నదంటే..?

Kavitha | నెల రోజులు గడువు.. మెడికల్ బోర్డు పెట్టకుంటే నిరహార దీక్ష: కవిత

UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్రతినిధిపై ఇజ్రాయెల్ రాయబారి ఫైర్

Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్.. ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..



