త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | గ‌త ఐదేండ్ల‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌నల‌ ఖ‌ర్చు రూ.2,586 కోట్లు..

PM Modi | ప్ర‌ధాని మోదీ (PM Modi).. ప్ర‌చార ఆర్భాటాలు (Advertisements) కాస్తా ఎక్కువే. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా రేడియో, టీవీ, ప‌త్రిక‌లు, హోర్డింగ్‌లు, డిజిట‌ల్‌, సోష‌ల్ మీడియాలో మారు మ్రోగాల్సిందే.

G

National | Published On Jun 20, 2026, 7.22 am IST

PM Modi | గ‌త ఐదేండ్ల‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌నల‌ ఖ‌ర్చు రూ.2,586 కోట్లు..
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ధాని మోదీ (PM Modi).. ప్ర‌చార ఆర్భాటాలు (Advertisements) కాస్తా ఎక్కువే. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా రేడియో, టీవీ, ప‌త్రిక‌లు, హోర్డింగ్‌లు, డిజిట‌ల్‌, సోష‌ల్ మీడియాలో మారు మ్రోగాల్సిందే. రోడ్ల‌పై ఎక్క‌డ చూసినా మోదీ బొమ్మ క‌న‌ప‌డాల్సిందే. ఏ న్యూస్‌ పేప‌ర్‌లోనైనా ఫ‌స్ట్ పేజీలో క‌ల‌ర్‌ఫుల్ ప్ర‌క‌ట‌న మెర‌వాల్సిందే. ఇక ప్ర‌ధానిగా మోదీ చేస్తున్న ప‌నుల గురించి చెబుతూ టీవీలు, సోష‌ల్ మీడ‌యాలో చెవులు చిల్లులు ప‌డేలా ప్ర‌క‌ట‌న‌లు రావాల్సిందే. ఇదంతా జ‌ర‌గ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌మొత్తంలో ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చుచేస్తున్న‌ది. గ‌త ఆరేండ్ల‌లో అంటే 200 నుంచి 2026 మ‌ధ్య కాలంలో ప్ర‌ధాని మోదీని ప్ర‌చారం ప్ర‌మోట్ చేసే ప్ర‌క‌ట‌నల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా రూ.2,586 కోట్లు ఖర్చు చేసింది.

ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌నల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని వెల్ల‌డించాల‌ని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ సాకేత్ గోఖలే (Saket Gokhale)  జూన్ 1న‌ స‌మాచార హ‌క్కు చ‌ట్టం (RTI) కింద ద‌ర‌ఖాస్తు చేశారు. దీంతో సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ క‌మ్యూనికేష‌న్ (CBC) 2020 నుంచి ఆర్థిక సంవత్సరాల వారీగా ఖర్చుల వివరాలతో కూడిన వివ‌రాల‌ను జూన్ 16న విడుదల చేసింది. అయితే, ఆ మొత్తాన్ని ఏయే ఏజెన్సీలకు చెల్లించార‌నే విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఖర్చులు ఇలా..

  • రేడియో, టీవీ ప్రకటనలు- రూ.936 కోట్లు
  • ప్రింట్ మీడియా (పత్రికలు)- రూ.796 కోట్లు
  • హోర్డింగ్‌లు (అవుట్‌డోర్ పబ్లిసిటీ)- రూ.584 కోట్లు
  • డిజిటల్ అండ్‌ సోషల్ మీడియా- రూ.270 కోట్లు

ఒక్క ఏజెన్సీ ద్వారానే..

కాగా, డిజిటల్ మాధ్యమాలపై ప్రకటనల ఖర్చు 2020-21లో కేవలం రూ.14 కోట్లు ఉండగా, 2025-26 నాటికి అది దాదాపు 10 రెట్లు పెరిగి రూ.131 కోట్లకు చేరింది. అయితే ఈ నిధులన్నీ కేవలం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అనే ఒకే ఒక్క ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఖర్చయ్యాయి. ఇతర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), పార్టీ పరంగా చేసిన ప్రకటనల ఖర్చులు ఇందులో చేర్చలేదు. కమర్షియల్ కాన్ఫిడెన్స్ (వాణిజ్య రహస్యం) అనే కారణాన్ని చూపుతూ రూ.2,586 కోట్లు ఏయే ప్రైవేట్ అడ్వర్ట‌యిజింగ్ ఏజెన్సీలు, మీడియా హౌస్‌లకు చెల్లించారో తెలపడానికి ప్ర‌భుత్వం నిరాకరించింది.

వాస్తవ ఖర్చు ఇంకా ఎక్కువే: ఎంపీ గోఖలే

ఈ సంఖ్యను జీర్ణించుకోవడం క‌ష్టంగా ఉంటుంద‌ని ఎంపీ గోఖలే అన్నారు. 2025-26లో పార్టీ కేవలం ముద్రణా మాధ్యమంలోనే దాదాపు రూ.338 కోట్లు ఖర్చు చేసింద‌ని తెలిపారు. గతేడాది దీనికోసం రూ.83.16 కోట్లు మాత్ర‌మే వెచ్చించింద‌ని, దానికంటే నాలుగు రెట్లు అధికంగా గ‌తేడాది ఖ‌ర్చులు ఉన్నాయ‌ని విమ‌ర్శిచారు. మొత్తంగా 2020 నుంచి 2026 మధ్య కాలంలో ప్రింట్ ప్రకటనల వ్యయం రూ.796 కోట్లకు చేరిందన్నారు. వాస్తవ ఖర్చు ఈ లెక్కల కంటే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement