Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమేంటి..?
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కోసం సంతకాలు జరిగినప్పటికీ చర్చలు జరగకుండా వాయిదా పడడం, మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండడం తదితర అంశాల కారణంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లలోనూ నష్టాలు సంభవిస్తున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కోసం సంతకాలు జరిగినప్పటికీ చర్చలు జరగకుండా వాయిదా పడడం, మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుండడం తదితర అంశాల కారణంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బులియన్ మార్కెట్లలోనూ నష్టాలు సంభవిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1.51 శాతం పతనమై 4,155 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.41 శాతం తగ్గి 64.82 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లోనూ క్షీణత కనిపించింది. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,106 పాయింట్లు పతనమై 1,47,203 వద్ద నిలవగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,387 పాయింట్లు తగ్గి 2,33,185 వద్ద స్థిరపడింది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,608 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16, 864 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,46,080 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,60,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.2,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,390 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,120గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,33,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,39,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,956 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,648గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,560 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,95,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,700 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు చాన్స్ వచ్చిందా..?
జూన్ 19, 2026

Gold | బంగారం ధర రూ.2.13 లక్షలకా? జేపీ మోర్గాన్ షాకింగ్ అంచనా!
జూన్ 18, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..
- ●NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్టీఏ ఏమన్నదంటే..?
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్లైన్లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..
- ●PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
- ●N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
- ●FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం

NEET UG | నీట్ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే ఎగ్జామ్ హాల్లోకి అనుమతి..

NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్టీఏ ఏమన్నదంటే..?

WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్లైన్లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..

PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..



