త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్య‌క్షుడి స‌తీమ‌ణికి బ‌హుమ‌తిగా ‘పోచంప‌ల్లి సిల్క్ స్టోల్’.. అంద‌జేసిన ప్ర‌ధాని మోదీ

Pochampally Ikat stoles | జీ7 సదస్సులో ప్రపంచ నేతలకు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రత్యేక బహుమతి అంద‌జేశారు. తెలంగాణ సంప్రదాయ ఇక్కత్ డైయింగ్ శైలిలో చేనేత కళాకారులు అద్భుతంగా నేసిన 'పోచంపల్లి సిల్క్ స్టోల్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి ప్ర‌ధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.

S

International | Published On Jun 19, 2026, 7.54 pm IST

Pochampally Ikat stoles | ఫ్రాన్స్ అధ్య‌క్షుడి స‌తీమ‌ణికి బ‌హుమ‌తిగా ‘పోచంప‌ల్లి సిల్క్ స్టోల్’.. అంద‌జేసిన ప్ర‌ధాని మోదీ
Advertisement

Pochampally Ikat stoles | త్రినేత్ర‌.న్యూస్ : జీ7 సదస్సులో ప్రపంచ నేతలకు భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రత్యేక బహుమతి అంద‌జేశారు. తెలంగాణ సంప్రదాయ ఇక్కత్ డైయింగ్ శైలిలో చేనేత కళాకారులు అద్భుతంగా నేసిన 'పోచంపల్లి సిల్క్ స్టోల్‌ను ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి ప్ర‌ధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.

ఇదే వేదిక‌పై ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన మహాభారత కలంకారీ పెయింటింగ్, ఆయన సతీమణి బ్రిగిట్ మాక్రాన్‌కు తెలంగాణ గర్వకారణమైన పోచంపల్లి సిల్క్ స్టోల్ బహుకరించారు. నాగౌరీ అశ్వగంధ, లకడాంగ్ పసుపు, రాంబన్ తేనె, బనారసీ సిల్క్ స్టోల్, కశ్మీరీ సిల్క్ కార్పెట్, హ్యాండ్‌క్రాఫ్టెడ్ థేవా మోటిఫ్ కఫ్‌లింక్స్ వంటి భారతీయ ప్రత్యేకతలను ప్రపంచ నేతలకు పరిచయం చేశారు ప్ర‌ధాని మోదీ.

Advertisement
Advertisement