త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ

Turkey Vs Paraguay | ఫిఫా ప్రపంచకప్-2026లో తుర్కియేకు షాక్ తగిలింది. ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో పరాగ్వే చేతిలో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది. పరాగ్వే కేవలం పది మంది ఆటగాళ్ల ఆడి మ్యాచ్‌ గెలువడం విశేషం.

P

Sports | Published On Jun 20, 2026, 11.29 am IST

Turkey Vs Paraguay | తుర్కియేకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ
Advertisement
  • ఫలితాన్ని నిర్ణయించిన ఒక్క గోల్‌
  • పరాగ్వేపై 1-0 తేడాతో ఓటమి

Turkey Vs Paraguay | ఫిఫా ప్రపంచకప్-2026లో తుర్కియేకు షాక్ తగిలింది. ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్-డీ మ్యాచ్‌లో పరాగ్వే చేతిలో 0-1 తేడాతో ఓటమి చవిచూసింది. పరాగ్వే కేవలం పది మంది ఆటగాళ్ల ఆడి మ్యాచ్‌ గెలువడం విశేషం. తొలి నిమిషాల్లోనే వచ్చిన గోల్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 64 సెకన్లకే మాటియాస్ గాలార్జా 25 మీటర్ల దూరం నుంచే కొట్టిన పవర్‌ఫుల్‌ డ్రైవ్‌ షాట్‌ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు రికార్డయ్యిన ఫాస్టెస్ట్‌ గోల్‌గా నిలిచింది.

పరాగ్వేకు ఎదురుదెబ్బ

మ్యాచ్ తొలి అర్ధభాగం స్టాపేజ్ టైమ్‌లో పరాగ్వేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మిగెల్ అల్మిరోన్ టర్కీ డిఫెండర్ మెరిహ్ డెమిరల్‌తో జరిగిన ఘర్షణకు దిగడంతో పాటు తొలిసారిగా రెడ్‌కార్డ్‌ను పొందాడు. ఫిఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘మౌత్ కవర్ రూల్’ కింద తొలి రెడ్ కార్డు ఇదే కావడం గమనార్హం. కేవలం పది మందితోనే పరాగ్వే అద్భుతంగా డిఫెన్స్‌ చేసింది. రెండో అర్ధభాగంలో తుర్కియే ఎటాక్‌కు దిగింది. అయితే, 32 షాట్స్‌, 12 కార్నర్లు, దాదాపు 80 శాతం బాల్ పొజెషన్ ఉన్నప్పటికీ ఒక్క గోల్‌ వేయలేకపోయింది. తుర్కియేకు వచ్చిన అవకాశాలన్నీ చేజారడంతో ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. చివరలో మెరిహ్ డెమిరల్ హెడ్డర్‌తో గోల్‌ చేసే ప్రయత్నం చేసినా బంతి దూరంగా వెళ్లడంతో ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి.

టోర్నీ నుంచి అవుట్‌..

ఈ ఓటమితో తుర్కియే జట్టు అధికారికంగా టోర్నీ నుంచి ఎగ్జిట్‌ అయ్యింది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో పాటు తాజాగా పరాగ్వేపై ఓటమి చవిచూసింది. చివరి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచినా కూడా నాకౌట్‌ అవకాశాలు మూసుకుపోయాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే తుర్కియే ఆటగాళ్లు మైదానంలోనే నిరాశలో మునిగిపోయారు. వరల్డ్‌కప్‌లో ఇంటిబాట పట్టడంతో అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు అమెరికాపై తొలి మ్యాచ్‌లో 1-4 తేడాతో ఓడిన పరాగ్వేకు ఈ విజయం కీలకంగా మారింది. మూడు పాయింట్లతో ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచిన పారాగ్వే, నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌లో పరాగ్వే–ఆస్ట్రేలియా మధ్య పోరు నిర్ణాయకంగా మారనుంది. టాప్-32లోకి వెళ్లే అవకాశాలు ఈ మ్యాచ్‌పై ఉండనున్నాయి.

Advertisement
Advertisement