త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | నెల రోజులు గ‌డువు.. మెడిక‌ల్ బోర్డు పెట్ట‌కుంటే నిరహార దీక్ష‌: క‌విత‌

Kavitha | వ‌చ్చే 20లోగా సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు (Medical Board) పెట్ట‌కుంటే నిర‌హార దీక్ష (Hunger Strike) చేస్తాన‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) హెచ్చ‌రించారు. ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు.

G

Telangana | Published On Jun 20, 2026, 11.37 am IST

Kavitha | నెల రోజులు గ‌డువు.. మెడిక‌ల్ బోర్డు పెట్ట‌కుంటే నిరహార దీక్ష‌: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే 20లోగా సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు (Medical Board) పెట్ట‌కుంటే నిర‌హార దీక్ష (Hunger Strike) చేస్తాన‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) హెచ్చ‌రించారు. ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు. మెడికల్ బోర్డులు ఏ రోజు నిర్వహిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా రెండు మెడికల్ బోర్డులు నిర్వహించి పెండింగ్‌లో 1200 కార్మికులకు వైద్య పరీక్షలు చేయాలి. అర్హులైన వారి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. బొగ్గు బాయి బాటలో భాంగా శ‌నివారం ఉద‌యం భూపాలపల్లి కాకతీయ ఖని- 5 గనిని సంద‌ర్శించారు. అనంత‌రం గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లో నడిపిస్తున్న‌దని, కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. ఉద్యమ కాలం నుంచి తాను సింగరేణి కార్మికులతో పనిచేశాన‌ని చెప్పారు.

తాను స్థాపించిన తెలంగాణ రక్షణ సేనను ఆదరించాలని కార్మికులను, భూపాలపల్లి ప్రజలను కోరారు. సింగరేణి వ్యాప్తంగా మంచి నీళ్లు, మంచి గాలి లోపలికి ఇవ్వలేకపోతున్నారని విమ‌ర్శించారు. కనీస అవసరాలైన గాలి, నీళ్ల‌ను కకృతి పడకుండా స్వచ్ఛ‌మైనవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాసిర‌కం డిటోనేట‌ర్ వాడ‌టం వ‌ల్లే సింగ‌రేణిలో ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. రెండు రోజుల‌క్రితం కార్మికుడు గాయప‌డ‌టమే దీనికి ఉదాహ‌ర‌ణ అని చెప్పారు. ఏదైనా పని జరగాలంటే నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి లంచం అడుగుతున్నారని ఆరోపించారు. విజిలెన్స్ ఎంక్వయిరీలతో కార్మికులను ఇబ్బంది పెట్టొద్దని, మారుపేర్లను సరిచేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఇండ్లు కట్టుకోవడానికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. సింగరేణికి ప్ర‌త్యేకంగా హౌసింగ్ బోర్డు పెట్టాలన్నారు.

Advertisement
Advertisement