త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | మైనంపల్లి.. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకం

KP Vivekananda | మైనంపల్లి హ‌న్మంత‌రావు గతంలో కేటీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నార‌ని.. ఆయ‌న‌ అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే రకమ‌ని అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి.వివేకానంద ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు దేవుడిలా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు దయ్యం అయ్యారా అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jun 21, 2026, 6.39 pm IST

KP Vivekananda | మైనంపల్లి.. అందితే జుట్టు లేదంటే కాళ్లు పట్టుకునే రకం
Advertisement
  • బీఆర్ఎస్‌లో ఉన్న‌ప్పుడు కేటీఆర్ దేవుడిలా క‌నిపిస్తే ఇప్ప‌డు ద‌య్యం అయ్యారా
  • నీ బెదిరింపుల‌కు ఎవ‌రూ భ‌య‌ప‌డ‌రు
  • త‌క్ష‌ణ‌మే నీ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకో
  • మీడియా సమావేశంలో కె.పి.వివేకానంద డిమాండ్

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: మైనంపల్లి హ‌న్మంత‌రావు గతంలో కేటీఆర్ కాళ్లు ప‌ట్టుకున్నార‌ని.. ఆయ‌న‌ అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే రకమ‌ని అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ విప్ కె.పి.వివేకానంద ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు దేవుడిలా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు దయ్యం అయ్యారా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ మైనంపల్లికి రాజకీయ పునర్జర్మ ఇచ్చారని గుర్తు చేశారు. ఎంపీగా టిక్కెట్ ఇస్తే మైనంపల్లి ఓడిపోయారని, అనంత‌రం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, గ్రేటర్ హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా అవకాశం వ‌చ్చింద‌న్నారు.

అక్ర‌మ కేసులు పెట్ట‌డం మైనంప‌ల్లికి అల‌వాటు..

మైనంపల్లి బీఆర్ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ఆయ‌న‌మతి స్థిమితం కోల్పోయారు. మైనంప‌ల్లికి బీఆర్ఎస్ అనేక అవకాశాలు ఇచ్చింది. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచింది. ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి కేటీఆర్‌ను ఏం చేయలేకపోయారు. అక్రమ కేసులు పెట్టాలని మైనంపల్లి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారా? అక్రమ కేసులు పెట్టడం మైనంపల్లికి అలవాటు. తస్మాత్ జాగ్రత్త. ఇంకో రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మైనంపల్లి బెదిరింపులకు ఎవరూ భయపడరు. క్షమాపణ చెప్పి తన మాటలను వెనక్కి తీసుకోవాలి అని వివేకానంద డిమాండ్ చేశారు.

ఎస్.ఐ.ఆర్, సభ్యత్వ నమోదుపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములను ఆధారాలతో బయటపెడుతున్నాం అని ఆయ‌న ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement