Municipal Election Results | మధ్యాహ్నంలోపు మున్సిపల్ ఫలితాలు.. ఒకే రౌండ్‌లో అలంపూర్ రిజల్ట్
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) గెలిచేదెవరో, ఓడేదెవరో మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంలోపు మున్సిపాలిటీలు, సాయంత్రం వరకు కార్పోరేషన్ల ఫలితాలు వెలువడుతాయి.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Election Results) గెలిచేదెవరో, ఓడేదెవరో మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నంలోపు మున్సిపాలిటీలు, సాయంత్రం వరకు కార్పోరేషన్ల ఫలితాలు (Results) వెలువడుతాయి. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఓట్లను లెక్కించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 123 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. తొలుత అలంపూర్ (Alampur) ఫలితాలు వెలువడుతాయి.
మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపులో పురపాలికల్లో వార్డుకో టేబుల్, నగరపాలికల్లో డివిజన్‌కో టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై ఒక్కో రౌండ్‌లో వేయి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. దీంతో అలంపూర్‌లో మొదటి రౌండ్‌లోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. ఇక కరీంనగర్‌లో నాలుగు రౌండ్లలో ఫలితం తేలనుంది.
తొలి రౌండ్‌లోనే..
అలంపూర్ మున్సిపాలిటీలో 7,104 ఓట్లు పడ్డాయి. అక్కడ పది వార్డులు ఉన్నాయి. అధికారులు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకే రౌండ్‌లో విజేతలు తేలనున్నారు. ఇక అత్యధికంగా మిర్యాలగూడలో 72,036 ఓట్లు పడ్డాయి. అక్కడ 48 వార్డులుండగా.. మొదటి రౌండ్‌లో 48 వేలు, రెండో రౌండ్‌లో 24,036 ఓట్లను లెక్కించనున్నారు.
ఇక కరీంనగర్ కార్పొరేషన్‌లో 2,14,486 ఓట్లు పోలయ్యాయి. నగరపాలికలో 66 వార్డులు ఉండగా.. 66 టేబుళ్లను ఏర్పాటుచేశారు. దీంతో ఒక్కో రౌండ్‌కు 66 వేల ఓట్ల చొప్పున నాలుగు రౌండ్లలో లెక్కించనున్నారు. నిజామాబాద్‌లో (2,05,753 ఓట్లు) నాలుగు రౌండ్లు, మహబూబ్‌నగర్‌లో (1,31,765 ఓట్లు), రామగుండంలో (1,24,520 ఓట్లు) మూడు, మంచిర్యాలలో (1,17,982 ఓట్లు) రెండు, నల్లగొండలో (1,10,194 ఓట్లు) మూడు రౌండ్లు, కొత్తగూడెంలో (1,00,432 ఓట్లు) రెండు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



