Municipal Elections | పురజనులెటువైపు..?
Municipal Elections | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రజల తీర్పు ఎటువైపు ఉండనుందో మరో రెండు రోజుల్లో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తంకానుంది. గత పది రోజులుగా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.
ముగిసిన ప్రచారం
బరిలో 12,930 మంది అభ్యర్థులు
ఎల్లుండే పోలింగ్
Municipal Elections | తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రజల తీర్పు ఎటువైపు ఉండనుందో మరో రెండు రోజుల్లో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తంకానుంది. గత పది రోజులుగా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బుధవారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం అయిదు గంటలకు అధికారికంగా ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,982 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మరో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12,930 మంది తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సైతం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో మరో విశేషం సైతం నమోదైంది. మొత్తం అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 12,930 మందిలో పురుషులు 6,434 (49.76 శాతం) మంది కాగా, మహిళలు 6,496 (50.24 శాతం) మంది.
అత్యధికంగా కరీంనగర్‌లో అభ్యర్థులు
అత్యధికంగా కార్పొరేషన్లలో కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీలలో ఆదిలాబాద్‌లో 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 34 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
పార్టీల వారీగా చూస్తే..
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 2,948 (98.3 శాతం) స్థానాల్లో, బీఆర్ఎస్ 2,878 (96 శాతం) స్థానాల్లో, బీజేపీ 2,634 (87.3 శాతం) స్థానాల్లో పోటీలో నిలిచాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు 2,786 (94 శాతం) స్థానాల్లో బరిలో నిలిచారు. జనసేన పార్టీ 332 (11.1 శాతం) స్థానాల్లో, మజ్లిస్ పార్టీ 282 (9.4 శాతం) స్థానాల్లో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 288 (9.6 శాతం) స్థానాల్లో, బీఎస్పీ 213 (7.3 శాతం) స్థానాల్లో, సీపీఐ 168 (5.6 శాతం) స్థానాల్లో, సీపీఎం 108 (4.2 శాతం) స్థానాల్లో, ఆప్ 38 (1.2 శాతం) స్థానాల్లో, ఐయూఎంఎల్ తొమ్మిది (0.3 శాతం) స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీల నుంచి పలువురు నామినేషన్లు వేసినప్పటికీ, బీఫారాలు సమర్పించకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఇతర పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్నారు.
ఏకగ్రీవమైనవి ఇవే..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 58వ డివిజన్‌లో రమాదేవి, రామగుండం కార్పొరేషన్‌లోని ఒకటో డివిజన్‌లో మాడిపల్లి విజయ, చౌటుప్పల్‌లో చింత ఉమామహేశ్వరి (17వవార్డు), హాలియాలో పిల్లి చంద్రకళ(10), ఎదులాపురంలో తమ్మినేని మంగతాయి(15), హుజూర్‌నగర్‌లో నాగలక్ష్మి(3), కోదాడలో దేవరపల్లి మల్లేశ్వరి(11), వై.కుసుమకుమారి(31), కట్టెబోయిన జ్యోతి(21), మెదక్‌లో గొడల మానస(32), వికారాబాద్‌లో అనంతరెడ్డి(1), యాదగిరిగుట్టలో గుండిపల్లి వాణి (10) కాంగ్రెస్ పార్టీ తరపున, అలంపూర్‌లో విక్రం(10), వికారాబాద్‌లో విజయలక్ష్మి (15వ వార్డు) బీఆర్ఎస్ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోటీలో 775 పోస్ట్ గ్రాడ్యుయేట్లు..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొత్తం అభ్యర్థుల్లో 775 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండడం గమనార్హం. గ్రాడ్యుయేట్లు 2,903 మంది, అండర్ గ్రాడ్యుయేట్లు 7,917 మంది కాగా, నిరక్షరాస్యులు 1,291 మంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



