DGP Anand | ఎంపీ గారు.. మీపై నిఘా కోసం ఎవరినీ నియమించలే: డీజీపీ సీవీ ఆనంద్
DGP Anand | తనపై సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పోలీసులతో నిఘా పెట్టించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం స్పందించారు. ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణల్లో ఎలాంటగి నిజం లేదని తేల్చి చెప్పారు.
DGP Anand | త్రినేత్ర.న్యూస్: తనపై సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పోలీసులతో నిఘా పెట్టించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం స్పందించారు. ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణల్లో ఎలాంటగి నిజం లేదని తేల్చి చెప్పారు. ఎంపీ చేసిన ఆరోపణలపై విచారించిన తర్వాతే అవాస్తవమని నిర్ధారించినట్లు డీజీపీ తెలిపారు.
'X' వేదికగా నిన్న మీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో సంబంధిత వర్గాల ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోవడానికి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఎంపీ గారు.. మిమ్మల్ని అనుసరించడానికి, లేదా మీ కదలికలపై నిఘా ఉంచడానికి ఏ అధికారిని కూడా నియమించలేదు. ఈ విషయాన్ని నేను మీకు స్పష్టం చేస్తున్నాను. అటువంటి విషయాలను మేం నమ్మం, ఎట్టిపరిస్థితుల్లో అటువంటి పనులు చేయం. అయినా మీ వద్ద ఏవైనా అదనపు వివరాలు ఉంటే దయచేసి వాటిని నాకు నేరుగా తెలపండి. వాటిని పూర్తిగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారిస్తాం అని డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..
- ●Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్
- ●Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
- ●Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి

Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..

Girlfriend leaves 3,400 kiss marks on car | ప్రియుడి కారుపై ప్రేయసి 3,400 కిస్ సింబల్స్.. వైరల్ కోసం యువకుడి వింత ఆలోచన

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్






