Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
Lava Virat V1 Pro 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన విరాట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా విరాట్ వన్ ప్రొ 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ కేంద్రిత ఉత్పత్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన పనితీరు, క్లీన్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటు ధరలో కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది.
Technology | Published On Aug 25, 2026, 11.52 am IST
Lava Virat V1 Pro 5G | దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన విరాట్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లావా విరాట్ వన్ ప్రొ 5జి పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ కేంద్రిత ఉత్పత్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన పనితీరు, క్లీన్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటు ధరలో కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇందులో6.74 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఎండలో స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 550 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్‌ను అందించారు. ఫోన్ గ్లాసీ ఫినిష్‌తో వస్తుంది. సిక్కిం మిడ్‌నైట్, స్పితి ఫ్రాస్ట్ అనే రెండు రంగుల్లో లభిస్తోంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్ ను కూడా ఇచ్చింది.
భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ టి8200 ప్రాసెసర్‌ను అమర్చారు. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ద్వారా 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ఏఐ ప్రధాన కెమెరాను అందించారు. నైట్ మోడ్, హెచ్‌డీఆర్, పోర్ట్రెయిట్, ఫిల్మ్, ప్రొ మోడ్, మోషన్ ఫోటో వంటి షూటింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. డ్యుయల్ వ్యూ వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు 30ఎఫ్‌పీఎస్ వద్ద 2కె రిజల్యూషన్‌లో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇందులో బ్లోట్‌వేర్ లేని ఆండ్రాయిడ్ 16 వస్తుంది. ఫోన్‌కు ఒక ప్రధాన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌తోపాటు రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని లావా ప్రకటించింది.
ధర ఎంతంటే..
డ్యయల్ 5జి సిమ్, 4జీ వోల్టీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైబ్రిడ్ సిమ్ ట్రే ద్వారా రెండు నానో సిమ్‌లు లేదా ఒక నానో సిమ్‌తో పాటు మైక్రోఎస్‌డీ కార్డును ఉపయోగించుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఏఐ ఆధారిత ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి. లావా విరాట్ వన్ ప్రొ 5జి 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో రూ.2వేల తగ్గింపు లభిస్తోంది. అన్ని ప్రధాన బ్యాంకుల క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై ఈ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. సెప్టెంబర్‌లో ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి తేనున్నారు. అయితే ఆఫ్‌లైన్ మార్కెట్‌లో ఇదే ఫోన్ ను షార్క్ 2 ప్రొ 5జి పేరుతో విక్రయించనున్నారు. లావా దేశవ్యాప్తంగా ఇంటి వద్దే ఉచిత సర్వీస్ అందించే ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ ఆఫర్‌ను కూడా ఈ ఫోన్‌కు అందిస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
- ●Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
- ●Stock Markets | పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Telangana | తెలంగాణలో తగ్గిన 21 శాతం ఓట్లు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..

Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..

Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు






