Bitcoin | క్రిప్టో మార్కెట్లలో బుల్ ర్యాలీ.. 80వేల డాలర్లకు చేరిన బిట్‌కాయిన్..
Bitcoin | బిట్‌కాయిన్ మళ్లీ 80 వేల డాలర్ల స్థాయికి చేరువైంది. సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, సాఫ్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్, షార్ట్ పొజిషన్ల లిక్విడేషన్లు కలిసి క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరును పెంచడంతో మార్కెట్ విస్తృతంగా కోలుకుంటోంది. తాజా సెషన్‌లో బిట్‌కాయిన్ 1.35 శాతం లాభపడింది.
Bitcoin | బిట్‌కాయిన్ మళ్లీ 80 వేల డాలర్ల స్థాయికి చేరువైంది. సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం, సాఫ్ట్ ఫైనాన్షియల్ కండిషన్స్, షార్ట్ పొజిషన్ల లిక్విడేషన్లు కలిసి క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరును పెంచడంతో మార్కెట్ విస్తృతంగా కోలుకుంటోంది. తాజా సెషన్‌లో బిట్‌కాయిన్ 1.35 శాతం లాభపడింది. ప్రస్తుతం కీలకమైన 80 వేల డాలర్ల స్థాయికి చేరువలో ఉంది. ఎథీరియం 2,500 డాలర్లకు పైన నిలదొక్కుకోగా, సోలానా, ఎక్స్‌ఆర్‌పీ, బీఎన్‌బీతో పాటు ఇతర ప్రధాన క్రిప్టో టోకెన్లు కూడా లాభాల్లోకి వచ్చాయి. అయితే ఈ ర్యాలీకి ప్రధానంగా బిట్‌కాయిన్‌నే చోదక శక్తిగా విశ్లేషకులు భావిస్తున్నారు. బిట్‌కాయిన్ 80 వేల డాలర్లను స్పష్టంగా అధిగమించి, విస్తృత స్థాయిలో కొత్త కొనుగోళ్లను ఆకర్షించగలిగితేనే ఈ ర్యాలీ కొనసాగుతుందని వారు చెబుతున్నారు.
85వేల డాలర్లకు చేరుతుందా..
డెల్టా ఎక్స్ఛేంజ్ రీసెర్చ్ అనలిస్ట్ రియా సెహగల్ మాట్లాడుతూ.. క్రిప్టో మార్కెట్‌లలో తాజా ర్యాలీకి బిట్‌కాయిన్ నాయకత్వం వహిస్తోందని తెలిపారు. 80 వేల డాలర్ల దిశగా బిట్‌కాయిన్ కదలిక మొత్తం మార్కెట్‌ను పైకి తీసుకెళ్తోందని చెప్పారు. ఎథీరియం 2,500 డాలర్లకు పైన కొనసాగుతుండగా, సోలానా, ఎక్స్‌ఆర్‌పీ, బీఎన్‌బీ వంటి ప్రధాన టోకెన్లు కూడా ముందుకు సాగుతున్నాయని ఆమె తెలిపారు. అయినప్పటికీ మార్కెట్ మొమెంటమ్‌కు ప్రధాన కారణం బిట్‌కాయిన్‌గానే ఉందన్నారు. 75,500 నుంచి 76,200 డాలర్ల డిమాండ్ జోన్ పైన బిట్‌కాయిన్ సాంకేతికంగా బలంగానే ఉందని సెహగల్ పేర్కొన్నారు. 80 వేల డాలర్ల పైన స్థిరంగా నిలదొక్కుకుంటే 81,500 నుంచి 82,300 డాలర్ల స్థాయిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. స్పష్టమైన బ్రేక్‌అవుట్ నమోదైతే 84 వేల నుంచి 85 వేల డాలర్ల వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
కారణాలేంటి..
తాజా బిట్‌కాయిన్ పెరుగుదలలో లెవరేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. డెల్టా ఎక్స్ఛేంజ్ పేర్కొన్న కాయిన్‌గ్లాస్ డేటా ప్రకారం గత 24 గంటల్లో మొత్తం క్రిప్టో లిక్విడేషన్లు సుమారు 634.9 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ధరలు పడిపోతాయని అంచనా వేసి షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్లపై ఒత్తిడి పెరగడంతో వారు తమ పొజిషన్లను మూసివేయాల్సి వస్తోంది. దీంతో అదనపు కొనుగోళ్ల ఒత్తిడి ఏర్పడుతోంది. ఈ ప్రక్రియనే షార్ట్ స్క్వీజ్‌గా పిలుస్తారు. ఇప్పటికే కొనసాగుతున్న ర్యాలీకి ఇది మరింత వేగాన్ని అందిస్తుంది. అయితే బలవంతపు కొనుగోళ్లు తగ్గిన తర్వాత మార్కెట్‌లో ఒక్కసారిగా రివర్సల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లెవరేజ్ ప్రస్తుతం మార్కెట్ కదలికను మరింత పెంచుతోందని సెహగల్ తెలిపారు. కాయిన్‌స్విచ్ మార్కెట్స్ డెస్క్ కూడా బిట్‌కాయిన్ రికవరీకి షార్ట్ లిక్విడేషన్లు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొంది.
బిట్ కాయిన్ కీలక స్థాయిలు ఇవే.
అయితే ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ మొమెంటమ్ సానుకూలంగా ఉన్నప్పటికీ, క్రిప్టోకు వెలుపల జరిగే పరిణామాలు కూడా మార్కెట్ కదలికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇక విశ్లేషకులు బిట్ కాయిన్‌కు గాను పలు కీలక స్థాయిలను కూడా వెల్లడించారు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు 80 వేల డాలర్ల స్థాయి తక్షణ పరీక్షగా మారింది. డెల్టా ఎక్స్ఛేంజ్ ప్రకారం 75,500 నుంచి 76,200 డాలర్ల ప్రాంతం కీలక డిమాండ్ జోన్. కాయిన్‌స్విచ్ సమీపకాలిక మద్దతును 74 వేల నుంచి 76 వేల డాలర్ల విస్తృత పరిధిలో ఉంచింది. గుప్తా మాత్రం 77 వేల డాలర్లను కీలక సపోర్ట్ స్థాయిగా గుర్తించారు. 80 వేల డాలర్ల పైన బిట్‌కాయిన్ స్థిరంగా కొనసాగితే 81,500 నుంచి 82,300 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాయిన్‌స్విచ్ ప్రకారం.. 83 వేల డాలర్లను అధిగమిస్తే బుల్లిష్ సెటప్ మరింత బలపడుతుంది. దీంతో 90 వేల డాలర్ల వైపు, ఆ తర్వాత 1 లక్ష డాలర్ల దిశగా కూడా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. అయితే 80 వేల నుంచి 90 వేల డాలర్ల ప్రాంతంలో చారిత్రకంగా ట్రేడింగ్ యాక్టివిటీ తక్కువగా ఉండటంతో ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకునే అవకాశం ఉందని కాయిన్‌స్విచ్ హెచ్చరించింది.
తాజావార్తలు
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్
- ●Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
- ●Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
- ●Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..

Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి






