త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KRMB | కృష్ణా న‌ది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు

KRMB | హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

S

Telangana | Published On Aug 24, 2026, 8.49 pm IST

KRMB | కృష్ణా న‌ది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు
Advertisement
  • తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల నీటి అవ‌స‌రాల‌పై మాత్ర‌మే చ‌ర్చ‌
  • కేటాయింపులు లేకుండానే కేఆర్ఎంబీ స‌మావేశం వాయిదా
  • హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

KRMB | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. భేటీకి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై ఈ భేటీలో చర్చలు జరిపారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకుగానూ నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశ పర్చారు. తొలుత ఈ నెల 13న సమావేశం అయ్యేందుకు తేదీని ఖరారు చేశారు. తర్వాత 17కు వాయిదా పడింది. ఆ సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. దీంతో సోమ‌వారం ఈ భేటీని నిర్వహించారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. తాగునీటి కోసం చెరి సగం వాడుకోవాలని తెలంగాణ సమావేశంలో ప్రస్తావించింది. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సెప్టెంబర్​ 4కు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు.

50:50 నిష్పత్తిలో వాడుకోవాలి

సాగర్, శ్రీశైలం నీటి వాటాలపై చర్చించామని తెలంగాణ ఈఎన్‌సీ రఘువర్ధన్‌ తెలిపారు. ఎల్‌నినో దృష్ట్యా తాగునీటికే వాడుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుందని అన్నారు. తాగునీటికి 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పామని, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

"నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్​లలో నీటి వాటాలపై చర్చ జరిగింది. ఎల్​నినో పరిస్థితుల దృష్ట్యా త్రాగునీటి కోసం మాత్రమే నీటిని వాడుకోవాలని త్రిసభ్య కమిటీలో నిర్ణయించారు. తాగునీటి కోసం 50:50 నిష్పత్తిలో వాడుకోవాలని చెప్పాం. ఏపీ పోతిరెడ్డిపాటు నుంచి ఎక్కువ నీరు వాడుకొందని ఫిర్యాదు చేశాం. సెప్టెంబర్ 4వ తేదీన తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చ ఉంటుంది. భవిష్యత్​లో ప్రవాహాలు వస్తే తదుపరి ఆలోచిస్తామని తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్ బాబు చెప్పారు.

సెప్టెంబర్ నాలుగో తేదీన చర్చిస్తాం

ఎల్ నినో పరిస్థితుల్లో తాగునీటి కోసమే ఉపయోగించుకోవాలని సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి తెలిపారు. రెండు రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదని, సెప్టెంబర్ నాలుగో తేదీన మళ్లీ సమావేశమై చర్చిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement