త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ – శివాజీ కాంబో రిపీట్‌

దాదాపు పంతొమ్మిదేళ్ల త‌ర్వాత శివాజీ కాంబో రిపీట్ కాబోతుంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో శ్రియా జోడీక‌ట్ట‌బోతుంది. ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా తెర‌కెక్కుతోన్న ధ‌ర్మ‌న్‌లో శ్రియా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఈ సీనియ‌ర్ బ్యూటీ ధ‌ర్మ‌న్ షూటింగ్‌లో జాయినైంది.

N

Entertainment | Published On Aug 25, 2026, 12.03 pm IST

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ – శివాజీ కాంబో రిపీట్‌
Advertisement

Shriya Saran | ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. తాజాగా మ‌రో సీనియ‌ర్ క‌థానాయిక ఈ సినిమాలో భాగ‌మైంది. సైలెంట్‌గా షూటింగ్‌లో అడుగుపెట్టింది.

క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌...

ర‌జ‌నీకాంత్ హీరోగా క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాత‌గా త‌మిళంలో ధ‌ర్మ‌న్ పేరుతో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో సిమ్రాన్‌తో పాటు యంగ్ హీరోయిన్లు రాశీఖ‌న్నా, మీనాక్షి చౌద‌రి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. తాజాగా ఈ సినిమాలో మ‌రో సీనియ‌ర్ బ్యూటీ అడుగుపెట్టింది. ధ‌ర్మ‌న్‌లో శ్రియా శ‌ర‌ణ్ కూడా ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంది శ్రియా. హ్యాపీ డే అంటూ ర‌జ‌నీకాంత్‌తో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

స్పెష‌ల్ సాంగ్‌...

ప్ర‌స్తుతం ధ‌ర్మ‌న్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని ఆర్ఎఫ్‌సీలో జ‌రుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో శ్రియా జాయినైంది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, శ్రియా తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై ద‌ర్శ‌కుడు అశ్వ‌త్‌ కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌తో పాటు కొన్ని స‌న్నివేశాల్లో ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి శ్రియా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

శివాజీ...

గ‌తంలో ర‌జ‌నీకాంత్, శ్రియా కాంబినేష‌న్‌లో శివాజీ మూవీ రూపొందింది. శంక‌ర్ డైరెక్ష‌న్‌లో 2007లో వ‌చ్చిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఆ ఏడాది హ‌య్యెస్ట్ క‌లెక్షన్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు పంతొమ్మిదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ర‌జ‌నీకాంత్‌కు జోడీగా శ్రియా న‌టించ‌బోతుండ‌టం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

విల‌న్‌గా టాలీవుడ్ హీరో....

ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్‌లో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్‌కు ధీటుగా సాగే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర కావ‌డంతో ఈ సినిమాలో న‌టించ‌డానికి రామ్ ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ వీక్‌లోనే ఈ సినిమా సెట్స్‌లో రామ్ అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. ధ‌ర్మ‌న్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement