Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
Polytechnic | రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని బాధిత విద్యార్థులు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
Polytechnic | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో 97 రద్దు చేయాలని బాధిత విద్యార్థులు, ఆయా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
పాలిటెక్నిక్ విద్యను ఆధునీకరించడానికి మరియు విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర భాగస్వాముల చట్టబద్ధమైన విద్యా, వృత్తిపరమైన ప్రయోజనాలను రక్షించడానికి ఈ కమిటీ పని చేయనుంది. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సభ్యులుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతాసిన్హా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌లు ఉన్నారు. ఈ కమిటీ సంబంధిత వర్గాలన్నింటితో విస్తృతంగా చర్చించి, అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..
- ●KRMB | కృష్ణా నది నీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- ●Harish Rao | గుండె తరుక్కుపోతున్నది : హరీశ్‌రావు

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న

Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..




