MP Gaddam Vamshikrishna | కాకా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
MP Gaddam Vamshikrishna | ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చాలన్న దివంగత కాకా వెంకటస్వామి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
MP Gaddam Vamshikrishna | త్రినేత్ర న్యూస్ : ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సాగునీటి కొరతను తీర్చాలన్న దివంగత కాకా వెంకటస్వామి ఆశయాన్ని సాకారం చేసేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.
కాకా వెంకటస్వామి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని కలలు కన్నారని ఎంపీ పేర్కొన్నారు. సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలన్నది కాకా వెంకటస్వామి ఆశయమని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కలసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు ఎంపీ వెల్లడించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని అంశాలు, అనుమతులు, ఇతర సాంకేతిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర జల సంఘం (CWC) ప్రత్యేక సమావేశం నిర్వహించి, మహారాష్ట్రతో ఉన్న అంశాలను పరిష్కరించుకుని అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు. “కాకా వెంకటస్వామి కలను సాకారం చేయడం కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. ఆదిలాబాద్ ప్రాంతానికి అవసరమైన సాగునీటి సౌకర్యాలను అందించడమే మా లక్ష్యం” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
ఉత్తర తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టు పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తామని ఆయన తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఎంపీ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






