Chamala Kiran Kumar Reddy | ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలా? కిషన్ రెడ్డివి అన్నీ యాక్షన్లే: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకుండా కిషన్ రెడ్డి మూసీ నది వద్ద పడుకుని యాక్షన్ చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ నాయకులతో పాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్‌గా ఆయన ఘాటు విమర్శలు చేశారు. నిధులు తీసుకురాకుండా కిషన్ రెడ్డి కేవలం డ్రామాలు ఆడుతున్నారని, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే.. గూగుల్‌లో వెతుక్కోండి
బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్‌కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కనీస అవగాహన లేదని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నితిన్ నబీన్ కొత్తగా వచ్చారని, తెలంగాణను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే (Congress Party) అన్న విషయం గూగుల్‌లో (Google) వెతికినా స్పష్టంగా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వేదికగా బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు ఉంటే, తెలంగాణ నుంచి కేవలం 12 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని.. అయినా సరే సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ సాధించామని ఆయన గుర్తు చేశారు. అసలు తెలంగాణ వస్తుందని నాడు కేసీఆర్ (KCR) కూడా ఊహించలేదని, ఆయన కేవలం టైమ్ పాస్ (Time pass) రాజకీయాలు చేశారని ఆరోపించారు.
రైతులు, నిధుల విషయంలో బీజేపీది వివక్షే
పదేళ్ల పాటు బీఆర్ఎస్ (BRS) హయాంలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటే.. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో సమాధానం చెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేంద్రం వద్ద తెలంగాణ రైతుల వరి ధాన్యం కొనే పరిస్థితి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం 38 శాతం ధాన్యం మాత్రమే ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులకు తెలంగాణ రైతుల పట్ల ఏమాత్రం బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.
తుమ్మిడి హెట్టి వద్ద కట్టాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాదని కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) కాస్తా.. ఇప్పుడు 'కూలేశ్వరం'గా మారిందని విమర్శించారు.
మూసీ దగ్గర కిషన్ రెడ్డి యాక్షన్
రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు ఏమాత్రం సహకరించడం లేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) అపాయింట్‌మెంట్ అడిగితే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో (Devendra Fadnavis) సమావేశం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోరని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 (Metro Phase 2) కోసం కేంద్రం నుంచి 15 శాతం నిధులు అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని, అదే తమిళనాడులో మెట్రోకు మాత్రం 60 శాతం నిధులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఇక మూసీ నది (Musi river) ప్రక్షాళనకు నిధులు ఇవ్వకుండా, కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి రివర్ బెడ్ మీద పడుకుని యాక్షన్ (Action) చేశారని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ బాగుపడటం బీజేపీకి ఇష్టం లేదా? అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
జులై 24, 2026

Revanth Reddy Chit Chat | సర్‌లో ఓటు పోతే ఇందిరమ్మ ఇల్లు రాదు.. రేషన్ కార్డు కట్
జులై 23, 2026

Telangana Paddy Procurement | రైతులకు భారీ ఊరట : అదనంగా వడ్లను కొనుగోలు చేస్తామన్న కేంద్రం
జులై 22, 2026
తాజావార్తలు
- ●Gen-Z Plantation | కేంద్రంపై జెంజీల గెలుపు.. చిహ్నంగా మొక్కలు నాటి సంబరాలు
- ●Tollywood | పొలిమేర వరల్డ్‌లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ - హారర్‌తో భయపెట్టడానికి రెడీ
- ●Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!
- ●RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు

Gen-Z Plantation | కేంద్రంపై జెంజీల గెలుపు.. చిహ్నంగా మొక్కలు నాటి సంబరాలు

Tollywood | పొలిమేర వరల్డ్‌లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ - హారర్‌తో భయపెట్టడానికి రెడీ

Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!

RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది



