Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు
Delhi Riots | ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. నిందితులు అత్యంత క్రూరంగా వ్యవహరించి, బాధితుడిపై పదేపదే దాడికి పాల్పడ్డారన్నారు. వారి ప్రవర్తన జంతువుల స్థాయికి దిగజారిందని పోలీసులు పేర్కొన్నారు.
Delhi Riots | ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. నిందితులు అత్యంత క్రూరంగా వ్యవహరించి, బాధితుడిపై పదేపదే దాడికి పాల్పడ్డారన్నారు. వారి ప్రవర్తన జంతువుల స్థాయికి దిగజారిందని పోలీసులు పేర్కొన్నారు. కర్కర్‌దూమా కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ ఎదుట శిక్ష ఖరారుపై వాదనలు జరిగాయి. ఈ కేసులో కోర్టు తుది తీర్పును జూలై 31న వెలువరించింది.
శరీరంపై 51 గాయాలు.. 18 కత్తిపోట్లు..
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ పాండే వాదనలు వినిపించారు. అంకిత్ శర్మను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు. మరణించిన తర్వాత కూడా నిందితులు మృతదేహంపై దాడి చేశారన్నారు. శర్మ శరీరంపై మొత్తం 51 గాయాలు ఉన్నాయని, వాటిలో 18 పదునైన ఆయుధాలతో చేసినవని కోర్టుకు వివరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన ఘోరమైన హత్యగా వాదించారు. నిందితులు ఘటన సమయంలో కర్కషంగా వ్యవహరించారని ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు. 2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అంకిత్ శర్మ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆయనను హత్య చేశారని తెలిపారు. నిందితులపై ఎలాంటి సానుభూతి చూపించవద్దని కోర్టును కోరారు.
ఉరిశిక్షపై అభ్యంతరం న్యాయవాదులు..
ఉరిశిక్ష విధించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తాహిర్ హుస్సేన్ తరఫు న్యాయవాదులు రాజీవ్ మోహన్, తారా నరులా వ్యతిరేకించారు. తమ క్లయింట్‌కు ప్రత్యేకంగా ఏ నేరపూరిత పాత్రను ఆపాదించలేదని వాదించారు. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితుల్లో ఆరుగురిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే మరణశిక్ష విధిస్తారని, జైలులో తాహిర్ ప్రవర్తన సైతం సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మపై ఓ గుంపు దాడి చేసింది. అనంతరం ఆయన మృతదేహం ఓ కాలువలో లభించింది. ఈ కేసులో జూలై 13న తాహిర్ హుస్సేన్, మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అల్లర్లకు, అగ్నిప్రమాదాలకు, దోపిడీలకు సిద్ధమైన ఆయుధాలతో కూడిన గుంపులో తాహిర్ భాగమయ్యారని, ఆ దాడిలోనే అంకిత్ శర్మ హత్యకు గురయ్యారని కోర్టు పేర్కొంది. భారతీయ శిక్షాస్మృతిలోని హత్య, కిడ్నాప్, అల్లర్లు, కుట్ర తదితర సెక్షన్ల కింద వారిని దోషులుగా తేల్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!
జులై 27, 2026

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
జులై 27, 2026

NEET Row | నందన్ నీలేకని కమిటీలో ఉన్నది ఎవరు? టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుంది?
జులై 27, 2026
తాజావార్తలు
- ●Tollywood | పొలిమేర వరల్డ్‌లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ - హారర్‌తో భయపెట్టడానికి రెడీ
- ●Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!
- ●RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
- ●KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..

Tollywood | పొలిమేర వరల్డ్‌లోకి యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీ - హారర్‌తో భయపెట్టడానికి రెడీ

Vivek Venkataswamy | సింగరేణి కార్మికులకు రూ.10వేల పెన్షన్ ఇవ్వండి.. కేంద్రమంత్రిని కోరిన వివేక్..!

RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్



