త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gen-Z Plantation | కేంద్రంపై జెంజీల గెలుపు.. చిహ్నంగా మొక్క‌లు నాటి సంబ‌రాలు

Gen-Z Plantation | నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో కేంద్రంపై పోరాడి గెలిచిన జెంజీలు మొక్క‌లు నాటి సంబ‌రాలు చేసుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వ‌ర్యంలో సింధురెడ్డి, అస్మా, ప్రత్యుష తదితరులు హైదరాబాద్‌లోని వెంగళ‌రావ్ పార్క్‌లో సోమ‌వారం మొక్కలు నాటారు.

S

Telangana | Published On Jul 27, 2026, 6.58 pm IST

Gen-Z Plantation | కేంద్రంపై జెంజీల గెలుపు.. చిహ్నంగా మొక్క‌లు నాటి సంబ‌రాలు
Advertisement
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభ‌కులు జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన జెంజీలు
  • ఇదొక మ‌హాయ‌జ్ఞంలా ముందుకెళ్లాల‌ని ఆకాంక్ష‌

Gen-Z Plantation | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో కేంద్రంపై పోరాడి గెలిచిన జెంజీలు మొక్క‌లు నాటి సంబ‌రాలు చేసుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వ‌ర్యంలో సింధురెడ్డి, అస్మా, ప్రత్యుష తదితరులు హైదరాబాద్‌లోని వెంగళ‌రావ్ పార్క్‌లో సోమ‌వారం మొక్కలు నాటారు. మొక్క‌లు నాటి విజయాన్ని ఆస్వాదించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభ‌కులు మాజీ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

జెంజీలు నేత‌లు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఎల్‌నినో ప్రభావం తగ్గి దేశంలో అధికంగా పంటలు పండాలన్నా, మంచి ఆక్సీజన్ కావాలాన్నా జెంజిలందరూ మొక్కలు నాటే కార్యక్రమం మహా యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. యువకులు తలుచుకుంటే చేయ‌లేనిది ఏమీ లేద‌న్నారు. జెంజీలంతా త‌లో మొక్క నాటి దేశంలో గ్రీనరి శాతం పెంచేలా కృషి చేయాల‌ని కోరారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్, కయ్య వెంకటేష్, కిరణ్ రాథోడ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement