త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Paddy Procurement | రైతులకు భారీ ఊరట : అదనంగా వడ్లను కొనుగోలు చేస్తామన్న కేంద్రం

తెలంగాణ రైతులకు కేంద్రం శుభవార్త! రబీ సీజన్ కు గాను అదనంగా మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

J

Telangana | Published On Jul 22, 2026, 3.34 pm IST

Telangana Paddy Procurement | రైతులకు భారీ ఊరట : అదనంగా వడ్లను కొనుగోలు చేస్తామన్న కేంద్రం
Advertisement
  • రబీ సీజన్‌లో తెలంగాణ నుండి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం
  • రాష్ట్రం నుండి సేకరించే మొత్తం బియ్యం కోటా 35 లక్షల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
  • ధాన్యం రవాణాలో పారదర్శకత కోసం 2026 సెప్టెంబర్ 30 లోపు వాహనాలకు VLTS (ట్రాకింగ్ సిస్టమ్) తప్పనిసరి
  • వడ్ల కొనుగోలు పెంచినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్

Telangana Paddy Procurement | త్రినేత్ర.న్యూస్ : యాసంగి (రబీ) సీజన్ లో వరి పండించిన తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రం నుంచి అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మొత్తం ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అమాంతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

పెరిగిన వడ్ల కొనుగోలు కోటా

రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతంలో నిర్ణయించిన 35 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) కోటాను ఇప్పుడు ఏకంగా 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. భారీగా ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో.. రైతులు నష్టపోకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు రైతులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటనివ్వనుంది. అదనపు కొనుగోళ్లతో రైతులకు ఆర్థిక భరోసా పెరగడంతో పాటు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత సాఫీగా సాగేందుకు అవకాశం ఏర్పడింది.

Image

రవాణాలో పారదర్శకత కోసం VLTS

ఇదే సమయంలో ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం మరో కీలక ఆదేశం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం తరలించే అర్హత గల అన్ని వాహనాల్లో 'వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్' (Vehicle Location Tracking System - VLTS) ను 2026 సెప్టెంబర్ 30 నాటికి వంద శాతం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ సిస్టమ్ ద్వారా వాహనాల కదలికలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా అక్రమాలకు చెక్ పడి, భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.

కేంద్రానికి మంత్రుల ధన్యవాదాలు

తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కోటాను పెంచినందుకు కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. పార్లమెంట్‌లో మంత్రి పీయూష్ గోయల్‌ను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర దక్కేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యవసాయ రంగానికి పెద్ద ఊతమిస్తుందని వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement