RS Praveen Kumar | రంగానాథ్‌ను అరెస్టు చేయాల్సింది.. హైకోర్టు తీర్పు రేవంత్‌కు చెంపదెబ్బలాంటిది
RS Praveen Kumar | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే తొలగించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందన్నారు. ఈ తీర్పు రేవంత్‌కు చెంప దెబ్బలాంటిదన్నారు.
- ఈ తీర్పును స్వాగతిస్తున్నాం..
- ఈరోజు రంగనాథ్.. రేపు డీజీపీ సీసీఎల్ఏ కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే
- హైడ్రా అరాచకాలు అన్నీ ఇన్నీ కావు
- రేవంత్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు
- అన్ని ఫైల్స్ శోధిస్తాం.. అధికారం వచ్చాక శిక్షిస్తాం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వెంటనే తొలగించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందన్నారు. ఈ తీర్పు రేవంత్‌కు చెంప దెబ్బలాంటిదన్నారు. హైడ్రా రేవంత్ మున్సిపల్ శాఖకు సంబంధించినదేనని, ఆయనకు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ఈరోజు రంగనాథ్.. రేపు డీజీపీ సీసీఎల్ఏ కోర్టు గుమ్మం ఎక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే తొలిరోజే హైడ్రాను రద్దు చేసి తీరుతామన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్మీని రంగంలోకి దించాలన్నదంటే పాలన ఉన్నట్టేనా?
ఇది కూల్చివేతల ప్రభుత్వం. పేదలకో న్యాయం.. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లుకో న్యాయమా? హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్ రియల్ దందాలు చేస్తున్నారు. హైడ్రాను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించాలి అని హైకోర్టు అన్నదంటే రాష్ట్రంలో పాలన ఉందా? రంగనాథ్‌ను అరెస్టు చేయాల్సింది. కానీ కోర్టు కొంత దయ చూపింది. మొదట్నుంచి హైడ్రా అరాచకాలపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంది అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోంది..
పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్‌పై ఉండటం ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతోంది. నాడు హిట్లర్ యూదులను నిర్మూలిస్తే నేడు రేవంత్ రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను తొలగిస్తున్నారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. లోతుకుంట, బహదూర్ గూడ, అమీన్‌పూర్‌లో హైడ్రా చేసిన అరాచకాల చిట్టా పెద్దది.
రంగనాథ్ పోయి వేరే అధికారి వచ్చినా రేవంత్ తీరు మారక పోతే హైడ్రా తీరు మారదు. అధికారులు కూడా రూల్ బుక్‌ను ఫాలో కావాలి. ఎవరైనా చట్టం ప్రకారం ఉద్యోగం చేయాలి. తప్పు చేసిన అధికారులపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయి. అన్ని ఫైల్స్ శోధిస్తాం. అధికారంలోకి వచ్చిన తొలిరోజే హైడ్రాను రద్దు చేస్తామని మా అధినేత కేసీఆర్ ప్రకటించారు. అది జరిగి తీరుతుంది అని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు
- ●Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
- ●KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
- ●Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్

Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు

Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు

KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..





