త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | పొలిమేర వ‌ర‌ల్డ్‌లోకి యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఎంట్రీ – హార‌ర్‌తో భ‌య‌పెట్ట‌డానికి రెడీ

హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన మా ఊరి పొలిమేర‌తో పాటు పొలిమేర 2 సినిమాలు ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టాయి. ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. పొలిమేర 3 టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సోమ‌వారం అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ లీడ్ రోల్‌లో న‌టించ‌బోతున్నాడు.

N

Entertainment | Published On Jul 27, 2026, 6.49 pm IST

Tollywood  |  పొలిమేర వ‌ర‌ల్డ్‌లోకి  యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఎంట్రీ – హార‌ర్‌తో భ‌య‌పెట్ట‌డానికి రెడీ
Advertisement

Tollywood | హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌తో రూపొందిన పొలిమేర ఫ్రాంఛైజ్ సినిమాలు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాయి. మా ఊరి పొలిమేర డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా...పొలిమేర 2 థియేట‌ర్ల‌లో విడుద‌లై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. పొలిమేర 3 పేరుతో రూపొందుతోన్న ఈ మూవీ సోమ‌వారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. సికింద్రాబాద్‌లోని గ‌ణేష్ టెంపుల్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, సురేష్ బాబుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

యాక్ష‌న్ కింగ్‌...

పొలిమేర 3లో యాక్ష‌న్ కింగ్ అర్జున్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. కొముర‌య్యగా మ‌రోసారి స‌త్యం రాజేష్ న‌టిస్తుండ‌గా...కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. తొలి రెండు పార్ట్‌ల‌కు మించి భారీ బ‌డ్జెట్‌తో పొలిమేర 3ని డైరెక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్ తెర‌కెక్కించ‌బోతున్నారు. క్షుద్ర విద్య‌లు, అతీంద్రియ శ‌క్తుల నేప‌థ్యంలో ఊహించ‌ని మ‌లుపుల‌తో ఈ సినిమా సాగుతోంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. వంశీ నందిపాటితో క‌లిసి జాన్వీ నారంగ్ ఈ హార‌ర్ మూవీని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

బ్లాస్ట్ జోన్‌...

బ్లాస్ట్ జోన్ మూవీతో పెద్ద హిట్టును అందుకున్నాడు అర్జున్‌. కేవ‌లం ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా పేరుతెచ్చుకున్న స‌త్యం రాజేష్ మా పొలిమేర‌తో హీరోగా మారాడు.

 

Advertisement
Advertisement