త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | కోర్టు తీర్పు కాపీ ఇంకా రాలేదు.. అప్పుడే సంబ‌రాలా..? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy | కాళేశ్వరం అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై (Justice PC Ghosh Commission) హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవాల‌ని చూస్తున్నార‌ని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) వ్యాఖ్యానించారు.

D

Telangana | Published On Apr 22, 2026, 3.28 pm IST

Chamala Kiran Kumar Reddy | కోర్టు తీర్పు కాపీ ఇంకా రాలేదు.. అప్పుడే సంబ‌రాలా..? ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

Chamala Kiran Kumar Reddy | కాళేశ్వరం అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక‌పై (Justice PC Ghosh Commission) హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ నేతలు తమకు అనుకూలంగా మలుచుకోవాల‌ని చూస్తున్నార‌ని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) వ్యాఖ్యానించారు. హై కోర్టు తీర్పు పూర్తి కాపీ ఇంకా రాలేద‌ని అన్నారు. ఘోష్ క‌మిష‌న్ రిపోర్టును కోర్టు ఎక్క‌డా త‌ప్పుప‌ట్ట‌లేద‌న్నారు. విచారణ ప్రక్రియలో (Procedure) కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని మాత్రమే ప్రస్తావించింద‌న్నారు. దీనికే బీఆర్ఎస్ నేత‌లు సంబ‌రాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుందని, అసలు విచారణ అప్పుడే మొదలవుతుందని ఆయన హెచ్చరించారు.

పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కంటే ముందే ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్టు ఇచ్చింద‌ని చామ‌ల‌ గుర్తుచేశారు. పీసీ ఘోష్ క‌మిష‌న్ ఆధారంగా ప్ర‌భుత్వం సీబీఐ ఎంక్వైరీ అడ‌గ‌లేద‌ని తెలిపారు. అందుకే ఈ స్టే ఆర్డ‌ర్ సీబీఐకి వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో బీజేపీ నేత‌లు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ మీద బాధ్య‌త పెరిగింద‌న్నారు. వారిద్ద‌రూ చొరవ తీసుకుని ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI investigation)ను వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తుది తీర్పు వెలువడినప్పుడు అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పు కాపీ చూశాక న్యాయ‌నిపుణుల‌తో చ‌ర్చించి సాయంత్రం త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని చామ‌ల స్ప‌ష్టం చేశారు. హరీష్ రావు ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మొన్న ఢిల్లీ పర్యటన రిటర్న్ గిఫ్ట్ ఏమైనా వచ్చిందా.. అన్న అనుమానం కలుగుతోంద‌న్నారు. కాళేశ్వ‌రం విష‌యంలో పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్ట్ ఒక్క‌టే కాద‌ని.. విజిలెన్స్ రిపోర్ట్‌, NDSA రిపోర్ట్ ఉన్న విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు.

Also Read..

సంతోష్ కుమార్‌కు అంబేద్క‌ర్ ప‌ట్ల గొప్ప గౌర‌వం : అనిల్ కూర్మాచ‌లం

ఆర్టీసీ స‌మ్మె వెనుక హ‌రీశ్‌రావు..

తమిళనాడులో 18 శాతం మంది అభ్యర్థుల‌పై క్రిమినల్ కేసులు.. ఎన్నిక‌ల వేళ ఆందోళ‌న క‌లిగిస్తోన్న నివేదిక‌

Advertisement
Advertisement