త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Kurmachalam | సంతోష్ కుమార్‌కు అంబేద్క‌ర్ ప‌ట్ల గొప్ప గౌర‌వం : అనిల్ కూర్మాచ‌లం

Anil Kurmachalam | మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు పర్యావరణ సంరక్షణ, సామాజిక బాద్యత, అంబేద్కర్ పట్ల వారికున్న గౌరవం గొప్పది అని ఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ అనిల్ కూర్మాచలం అన్నారు.

S

Telangana | Published On Apr 22, 2026, 3.25 pm IST

Anil Kurmachalam | సంతోష్ కుమార్‌కు అంబేద్క‌ర్ ప‌ట్ల గొప్ప గౌర‌వం : అనిల్ కూర్మాచ‌లం
Advertisement

Anil Kurmachalam | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు పర్యావరణ సంరక్షణ, సామాజిక బాద్యత, అంబేద్కర్ పట్ల వారికున్న గౌరవం గొప్పది అని ఎఫ్‌డీసీ మాజీ చైర్మ‌న్ అనిల్ కూర్మాచలం అన్నారు. లండన్‌లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ "గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును" అందుకొనే ముందు మొక్కలు నాటి, అంబేద్కర్ హౌస్‌ని సందర్శించడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.

హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బ్రిటన్ పార్లమెంట్‌లో అరుదైన గౌరవం దక్కిని విషయం మనకు తెలిసిందే.

పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అందుకోబోయే ముందు సంతోష్ కుమార్ లండన్‌లోని బర్కీలీ గార్డెన్‌లో మొక్కను నాటాడమే కాకుండా, సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ హౌస్‌ని లండ‌న్‌లో సందర్శించి వారికి నివాళులు అర్పించి తదనంతరం హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం అందుకోవడం వారి సామాజిక సృహకు నిర్దర్శనమని, సమాజం పట్ల ముఖ్యంగా అంబేద్కర్ గారి పట్ల వారికున్న గౌరం ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు.

అన్ని సందర్భాల్లో తానూ నమ్మిన పర్యావరణ సంరక్షణ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలు ఎప్పటికీ మరువకుండా తన జీవన విధానంలో ఆచరించడం గొప్ప విషయమని అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ, ఇగ్నీట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, గణేష్ కుప్పాల, రవి పులుసు, సురేష్ గోపతి, పవన్ కళ్యాణ్, తరుణ్ లూనావత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement