Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
Hydrogen Train | త్రినేత్ర.న్యూస్ : భారతీయ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train) అందుబాటులోకి వచ్చింది.
Hydrogen Train | త్రినేత్ర.న్యూస్ : భారతీయ రైల్వేలో (Indian Railways) సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు (Hydrogen Train) అందుబాటులోకి వచ్చింది. హర్యానాలోని జింద్‌లో (Jind) ఈ రైలు పట్టాలెక్కింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) జెండా ఊపి రైలు సేవలను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 10 కోచ్‌లతో ఈ రైలును అందుబాటులోకి తెచ్చారు. జింద్-సోనిపట్ (Jind-Sonipat) మార్గంలో ఇది రాకపోకలు సాగించనుంది. ఈ మార్గంలో మొత్తం 12 స్టేషన్లలో రైలు ఆగుతుంది. సుమారు 90 కి.మీ. దూరం గల ఈ మార్గాన్ని కేవలం ఒక గంటలో చేరుకోనుంది.
ఇక ఈ రైల్లో మొత్తం 682 సీట్లు ఉంటాయి. ఒకేసారి 2600 మంది ఇందులో ప్రయాణించొచ్చు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్ధ్యంతో దీనిని తయారుచేసినప్పటికీ 75 కిలోమీటర్లకే పరిమితం చేశారు. ప్రతిరోజు జింద్-సోనిపట్ మధ్య రెండు ట్రిప్పులు నడువనుంది. ఈ రైలు కోసం జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే కంప్రెస్డ్ హైడ్రోజన్ ఫ్యూయల్‌ని రైలులో నింపుతారు.
#WATCH | Jind, Haryana: Prime Minister Narendra Modi flags off the country's first hydrogen-powered train from Jind to Sonipat
(Video source: DD) pic.twitter.com/kMQv2nBhOZ
— ANI (@ANI) July 17, 2026
ఇవీ రైలు ప్రత్యేకతలు..
ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇందులో 1,200-కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చారు. ఫ్యూయల్ సెల్ సాంకేతికత ద్వారా హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్‌తో కలిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఈ రైలు ద్వారా ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి. మేక్ ఇన్ ఇండియా, హరిత రవాణా మిషన్‌లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో రూ. 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు. ఒకసారి హైడ్రోజన్‌ను నింపితే ఈ రైలు సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ రైల్లో టికెట్ ధరలు కూడా చాలా తక్కువే. సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. రూ. 5 నుంచి రూ. 25 మధ్య నిర్ణయించారు.
ఈ రైలులో సుమారు 27 హైడ్రోజన్ సిలిండర్లను అమర్చారు. హైడ్రోజన్ లీకేజీని గుర్తించే డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర మార్గాల్లో కూడా ఇలాంటి హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ రైలు రాకతో.. హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైలును నడిపే దేశాల జాబితాలో భారత్ చేరింది. ఇప్పటికే ఈ తరహా రైళ్లు జర్మనీ, జపాన్, చైనా, అమెరికాలో నడుస్తున్నాయి.
Also Read..
దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్‌టాప్.. భారత్‌లోనే తయారీ..
ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్
- ●Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..
- ●Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే
- ●Malaysia Visa-Free Travel India | మలేషియా వీసా-ఫ్రీ ట్రిప్‌తో ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? అది చట్టరీత్యా నేరం.. భారత్ హెచ్చరిక
- ●OnePlus N6 Lite | వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్.. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు..

Kayadu Lohar | ఆ విషయంలో అదృష్టవంతురాలిని - సుబ్బలక్ష్మిగా సర్ప్రైజ్ చేస్తా - కయదు లోహర్ కామెంట్స్

Minister Vakiti Srihari | జూరాలపై రాజకీయ రాద్ధాంతం వద్దు..

Stock Markets | చమురు ధరలు తగ్గినా.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం లబ్ధిదారులు దళితులే






