త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ అలాట్‌మెంట్ నేడే.. స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు గాను ఇటీవ‌లే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన విష‌యం విదిత‌మే. అయితే పెట్టుబ‌డిదారుల‌కు శుక్ర‌వారం నాడు షేర్ల‌ను అలాట్ చేయ‌నున్నారు. దీంతో ఈ రోజు కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాట్‌మెంట్ పొందని దరఖాస్తుదారులకు జూలై 20న రీఫండ్‌లు ప్రాసెస్ చేయనున్నారు.

S

Business | Published On Jul 17, 2026, 12.26 pm IST

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ అలాట్‌మెంట్ నేడే.. స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?
Advertisement

SBI Funds Management IPO | ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు గాను ఇటీవ‌లే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసిన విష‌యం విదిత‌మే. అయితే పెట్టుబ‌డిదారుల‌కు శుక్ర‌వారం నాడు షేర్ల‌ను అలాట్ చేయ‌నున్నారు. దీంతో ఈ రోజు కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అలాట్‌మెంట్ పొందని దరఖాస్తుదారులకు జూలై 20న రీఫండ్‌లు ప్రాసెస్ చేయనున్నారు. అదే రోజున షేర్లు అలాట్ అయిన ఇన్వెస్ట‌ర్ల‌కు త‌మ డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జ‌మ అవుతాయి. అనంతరం జూలై 21న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ ఎక్స్చేంజ్‌లలో షేర్‌ లిస్ట్ కానుంది. కాగా ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓకు భారీ స్పందన లభించింది. జూలై 16తో ముగిసిన బిడ్డింగ్ చివరి రోజున ఈ ఇష్యూ మొత్తం 41.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్ చేసిన 12,45,63,536 షేర్లకు గాను 5,18,95,47,480 షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి.

బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పోర్ట‌ల్స్‌లో..

విభాగాల వారీగా చూస్తే, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) కోటా 140.11 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్‌ఐఐలు) 22.51 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 3.60 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఐపీఓలో పాల్గొన్న ఇన్వెస్టర్లు తమ అలాట్‌మెంట్ స్టేటస్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్లతోపాటు ఇష్యూ రిజిస్ట్రార్ కేఫిన్ టెక్నాలజీస్ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ముందుగా బీఎస్‌ఈ ఐపీఓ అలాట్‌మెంట్ పేజీని ఓపెన్ చేయాలి. అక్కడ ఇష్యూ టైప్‌గా ఈక్విటీని ఎంపిక చేయాలి. అనంతరం డ్రాప్‌డౌన్ మెనూలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ను సెలెక్ట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్ నమోదు చేసి క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. చివరగాసెర్చ్ బటన్‌పై క్లిక్ చేస్తే అలాట్‌మెంట్ స్టేటస్ కనిపిస్తుంది. ఎన్ఎస్ఈలో అయితే ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ అలాట్‌మెంట్ పేజీకి వెళ్లి ఈక్విటీ అండ్ ఎస్‌ఎంఈ ఐపీఓ బిడ్ డీటెయిల్స్ ను ఎంచుకోవాలి. తర్వాత కంపెనీ సింబల్ ఎస్‌బీఐఫండ్స్ ను సెలెక్ట్ చేయాలి. అనంతరం పాన్ నంబర్, అప్లికేషన్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే షేర్ అలాట్‌మెంట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

కేఫిన్ టెక్నాలజీస్ వెబ్‌సైట్‌లో..

కేఫిన్ టెక్నాలజీస్ ఐపీఓ అలాట్‌మెంట్ పేజీకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ ను ఎంపిక చేయాలి. అనంతరం పాన్ నంబర్, అప్లికేషన్ నంబర్ లేదా డీపీ ఐడీ, క్ల‌యింట్ ఐడీ వంటి అందుబాటులో ఉన్న గుర్తింపు విధానాల్లో ఒకదాన్ని ఎంచుకుని సంబంధిత వివరాల‌ను నమోదు చేయాలి. చివరగా సబ్మిట్ పై క్లిక్ చేస్తే అలాట్‌మెంట్ స్టేటస్ క‌నిపిస్తుంది. కాగా ఇన్వెస్టర్‌గెయిన్ సమాచారం ప్రకారం జూలై 17 నాటికి ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) రూ.97గా నమోదైంది. దీంతో ఎగువ ధర బ్యాండ్ రూ.574తో పోలిస్తే సుమారు 16.90 శాతం ప్రీమియంతో ఒక్కో షేరు సుమారు రూ.671 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాన్ని ఇది సూచిస్తోంది. అయితే జీఎంపీ అధికారిక సమాచారం కాదని, మార్కెట్ అంచనాల ఆధారంగా మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ రూపంలోనే..

ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ ధర బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.545 నుంచి రూ.574గా నిర్ణయించారు. మొత్తం రూ.9,812.91 కోట్ల విలువైన ఈ బుక్-బిల్ట్ ఇష్యూలో 17.10 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మాత్రమే ఉంది. కొత్త షేర్ల జారీ జరగలేదు. ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ సంస్థకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్‌కు చెందిన అముండి సంయుక్త యజమానులు. ఈ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. ఈ పబ్లిక్ ఇష్యూను పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో నిర్వహించినందున, ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తం నిధులు కంపెనీకి కాకుండా షేర్లు విక్రయించిన ప్రస్తుత వాటాదారులకే వెళ్తాయి.

Advertisement
Advertisement