Chanagani Dayakar | యువ సంగ్రామ సదస్సు కాదు.. నిరుద్యోగులకు బీఆర్ఎస్ చేసిన విద్రోహ సభ: చనగాని దయాకర్
Chanagani Dayakar | నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) లేదని టీపీపీ ప్రధాన కార్యదర్శి చనగాని దయార్ (Chanagani Dayakar) విమర్శించారు. ఆయన వెంటనే తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) లేదని టీపీపీ ప్రధాన కార్యదర్శి చనగాని దయార్ (Chanagani Dayakar) విమర్శించారు. ఆయన వెంటనే తెలంగాణ (Telangana) యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ (BRS) తలపెట్టిన సభ.. యువ సంగ్రామ సదస్సు (Yuva Sangram Sabha) కాదని, అది నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ చేసిన విద్రోహ సభ అని మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో గ్రూప్ 1 నిర్వహించలేని అసమర్థులని దుయ్యబట్టారు. ప్రవళిక, సునీల్ నాయక్, మురళి ముదిరాజ్ ఆత్మహత్యలకు కారకులు కదా? అని ప్రశ్నించారు.
పోటీ పరీక్షల్లో లీకేజీలు, ఇంటర్ లీకేజీలు, పదవ తరగతి పరీక్షలో లీకేజీలకు పాల్పడిన ద్రోహులు యువత గురించి ఆలోచన చేయడమా అని మండిపడ్డారు. పదేండ్లలో సాధ్యంకాని గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్-3, గ్రూప్-4, ఏఈఈ, నర్సింగ్, హెల్త్ ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్ (Revanth Reddy) పాలనలో చేసి చూపించారని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. పదేండ్ల పాలన అవినీతి, అక్రమ ఆస్తుల కోసం తప్ప.. తెలంగాణ యువత కోసం, ఉద్యోగాల భర్తీ కోసం ఏనాడు ఆలోచన చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ యువతకు ప్రైవేట్, ఫార్మా, ఇండస్ట్రీయల్, సాంకేతిక రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్లడించారు. కేటీఆర్ గారడీ మాటలను తెలంగాణ యువత నమ్మదని స్పష్టం చేశారు.
హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్
మరోవైపు శనివారం సరూర్‌నగర్‌లో (Saroornagar) బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు ఇప్పటివరకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు పార్టీ సిద్ధమవుతున్నది.
సంబంధిత వార్తలు

KTR | కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం.. విద్యార్థుల యువజన సభలో అన్నీ చెబుదాం
జులై 16, 2026

Mallikarjun Kharge | డీలిమిటేషన్ బిల్లుపై చర్చిద్దాం.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
జులై 16, 2026

Sampath Kumar | ఆర్ఎస్ ప్రవీణ్.. ప్రవర్తన మార్చుకో.. లేదంటే బీఆర్ఎస్ డస్ట్‌బిన్‌లో డస్ట్ పేపర్ అవుతవ్
జులై 16, 2026
తాజావార్తలు
- ●Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ●GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్‌టాప్.. భారత్‌లోనే తయారీ..
- ●NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..
- ●Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.7,600 తగ్గిన బంగారం ధర.. పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●Train Hits School Van | ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు.. పలువురు మృతి

Hydrogen Train | పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్‌టాప్.. భారత్‌లోనే తయారీ..

NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..

Gujarat ATS | దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు జైషే టెర్రరిస్టులు అరెస్ట్



