GIGABYTE | గిగాబైట్ మేడ్ ఇన్ ఇండియా గేమింగ్ ల్యాప్‌టాప్.. భారత్‌లోనే తయారీ..
GIGABYTE | గిగాబైట్ తన తొలి మేడ్ ఇన్ ఇండియా (ఎంఐఐ) గేమింగ్ ల్యాప్‌టాప్ గిగాబైట్ గేమింగ్ ఎ16 ని లాంచ్ చేసింది. భారత్‌లో స్థానికంగా తయారైన కంపెనీ తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం. ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌లతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ను గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Technology | Published On Jul 17, 2026, 11.59 am IST
GIGABYTE | గిగాబైట్ తన తొలి మేడ్ ఇన్ ఇండియా (ఎంఐఐ) గేమింగ్ ల్యాప్‌టాప్ గిగాబైట్ గేమింగ్ ఎ16 ని లాంచ్ చేసింది. భారత్‌లో స్థానికంగా తయారైన కంపెనీ తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం. ఏఎండీ రైజెన్ ప్రాసెసర్‌లతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ను గేమర్లు, కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఏఐ-రెడీ కంప్యూటింగ్ సామర్థ్యాలను కూడా ఇందులో అందించారు. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ తయారీ కోసం గిగాబైట్ డిక్సన్ టెక్నాలజీస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం గిగాబైట్ ఇంజినీరింగ్ ప్రమాణాలు, డిక్సన్ తయారీ నైపుణ్యాన్ని కలిపి భారత్‌లోనే గేమింగ్ ల్యాప్‌టాప్‌లను తయారు చేసినట్లు తెలిపారు.
ఫీచర్లు ఎలా ఉన్నాయి..
ఈ లాంచ్ సందర్భంగా గిగాబైట్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ సింక్లేర్ షియావోతో పాటు కంపెనీ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, మెటీరియల్స్ ప్లానింగ్, క్వాలిటీ అష్యూరెన్స్ విభాగాల సీనియర్ అధికారులు భారత్‌ను సందర్శించారు. తయారీ ప్రక్రియ మొత్తంలో డిక్సన్ టెక్నాలజీస్‌తో కలిసి పనిచేసి, ల్యాప్‌టాప్‌ల పనితీరు, విశ్వసనీయత, నాణ్యత వంటి గిగాబైట్ గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షించినట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో స్థానిక తయారీని మరింత విస్తరించడంతోపాటు దేశంలో తన తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్లు గిగాబైట్ పేర్కొంది. అయితే భారత్‌లో తయారవుతున్న గిగాబైట్ గేమింగ్ ఎ16 కు సంబంధించిన పూర్తి హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గేమింగ్ ఎ16 మోడల్‌లో 16 ఇంచుల ఐపీఎస్ డిస్‌ప్లే, గరిష్ఠంగా డబ్ల్యూక్యూఎక్స్‌జీఏ రిజల్యూషన్, 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 64 జీబీ ర్యామ్, 4 టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, డాల్బీ అట్మాస్ ఆడియో, వై-ఫై 6ఈ కనెక్టివిటీ, 76 వాట్-అవర్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గిగాబైట్ గేమింగ్ ఎ16 ప్రస్తుతం భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ధర, పూర్తి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ వివరాలను అధికారిక విక్రయాల ప్రారంభానికి సమీపంలో వెల్లడించనున్నారు.
తాజావార్తలు
- ●Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం
- ●ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?
- ●Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ
- ●Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
- ●DGP Anand | ఇలాగే ముందుకు సాగండి.. అవార్డు పొందిన ఈగల్ ఫోర్స్ టీమ్‌కు డీజీపీ అభినందనలు
- ●Special Trains | చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్, సెంగోట్టైకి ప్రత్యేక ట్రైన్స్‌ను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Phone Screen Protectors | నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందే.. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కీలక నిర్ణయం

ఒక్క ఆదేశంతో యుద్ధం.. ఒక్క మాటతో విరమణ! అమెరికా అధ్యక్షుడి చేతిలో నిజంగా అంత పవర్ ఉందా?

Namma Metro Daily Commute Cost | మెట్రో ఎక్కాలంటే రూ.70,000 జీతం ఉండాల్సిందేనా? పబ్లిక్ ఇన్ఫ్రాపై వైరల్ అవుతున్న చర్చ

Chiranjeevi | 48 ఏళ్ల క్రితం ఇదే రోజు చిరంజీవిగా పేరు మార్చుకున్నా - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్





