Mancherial | ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని.. బావిలోకి దూకిన తల్లి..
Mancherial | మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలంలో లింగాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలోకి (Well) దూకి ఆత్మహత్య చేసుకుంది.
Mancherial | త్రినేత్ర.న్యూస్: మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి మండలంలో లింగాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఆరేండ్ల బిడ్డను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలోకి (Well) దూకి ఆత్మహత్య చేసుకుంది.
లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు ఏడేండ్ల క్రితం జగిత్యాల (Jagtial) జిల్లా గొల్లపల్లి మండలంలోని వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో వివాహమైంది. వారికి కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్ (18 నెలలు) ఉన్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో రజిత తన పుట్టింటికి వచ్చేసింది. గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నది. పిల్లలను చూసేందుకు అంజయ్య అప్పుడప్పుడు అక్కడికి వచ్చివెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం కూడా అతడు తన పిల్లలను చూసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికే రజిత తన కుమారుడిని పడుకోబెట్టి.. కుమార్తె అక్షితను తీసుకుని ఊరి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ కుమార్తెను తన నడుముకు కట్టుకుని బావిలోకి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెళికితీసి పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే రజిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, తల్లీ కూతుళ్ల ఆత్మహత్యపై ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
- ●Night Shift Buses | రేపటి నుంచి హైదరాబాద్‌లో రాత్రి బస్సులు.. ఏయే రూట్లలో అంటే?
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
- ●IPO | ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..
- ●Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం
- ●Jayam Ravi | ప్రియురాలిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్న కోలీవుడ్ హీరో
- ●Anganwadi Teachers | రంగారెడ్డి జిల్లాలో 125 అంగన్వాడీ టీచర్ పోస్టులు.. వచ్చేనెల 10 వరకు దరఖాస్తులు

Night Shift Buses | రేపటి నుంచి హైదరాబాద్‌లో రాత్రి బస్సులు.. ఏయే రూట్లలో అంటే?

Rahul Gandhi | రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

IPO | ఈ వారంలో వస్తున్న 7 ప్రధాన ఐపీవోలు ఇవే.. రూ.1265 కోట్లకు పైగా ఇష్యూలు..

Delhi Gang Rape | ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం






