త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | బ‌స్సులో 80 మంది ప్ర‌యాణికులు.. పురుషులు ఇద్ద‌రే.. న‌గదు ఎలా వ‌స్తుంది?

RTC Bus | మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం (Free Bus For Women) అమ‌లు చేస్తుండ‌టంతో ఆర్టీసీ బ‌స్సులు (RTC Bus) కిక్కిరిసిపోతున్నాయి. పల్లే, ప‌ట్నం అనే తేడా లేకుండా బ‌స్సులు మ‌హిళ‌ల‌తో నిండిపోతున్నాయి.

G

Telangana | Published On Aug 26, 2026, 12.41 pm IST

RTC Bus | బ‌స్సులో 80 మంది ప్ర‌యాణికులు.. పురుషులు ఇద్ద‌రే.. న‌గదు ఎలా వ‌స్తుంది?
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం (Free Bus For Women) అమ‌లు చేస్తుండ‌టంతో ఆర్టీసీ బ‌స్సులు (RTC Bus) కిక్కిరిసిపోతున్నాయి. పల్లే, ప‌ట్నం అనే తేడా లేకుండా బ‌స్సులు మ‌హిళ‌ల‌తో నిండిపోతున్నాయి. దీంతో బ‌స్సు ఎక్కాలంటేనే పురుషులు భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ క్ర‌మంలో మంచిర్యాల (Mancherial) డిపోన‌కు చెందిన ఓ బ‌స్సులో 80 మంది ప్ర‌యాణికులు ఉంటే.. అందులో ఇద్ద‌రు మాత్ర‌మే పురుషులు ఎక్కారు. దీంతో డ‌బ్బులు వ‌స్తాయంటూ బ‌స్సు కండ‌క్ట‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

మంచిర్యాల డిపో బ‌స్సు దేవాపూర్ నుంచి మంచిర్యాల వెళ్తున్న‌ది. బ‌స్సు మ‌హిళ‌ల‌తో కిక్కిరిసిపోయింది. దీంతో డిపార్టుమెంటు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్న‌ది. దానికి అనుగుణంగా తాము ప‌నిచేస్తున్నాం. అయినప్ప‌టికీ టికెట్ డ‌బ్బులు తీసుకురావాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బ‌స్సులో 80 మంది వ‌ర‌కు ప్ర‌యాణికులు ఉంటే.. అందులో ఇద్ద‌రు మాత్ర‌మే మ‌గ‌వారు ఉన్నారు. ఇలా అయితే నగదు ఎలా తీసుకురావడం అని ప్రశ్నించారు. అధికారులు గమనించి కండక్టర్లపై ఒత్తిడి ఆపివేయాలి. ఉచిత బస్సు పథకం అమలవుతున్నప్పుడు టికెట్‌ డబ్బుల కోసం తమను ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

Advertisement
Advertisement