AR Constable | అంబర్‌పేటలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
AR Constable | ప్రేమ విఫలమవడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) ఆత్మహత్య చేసుకున్నారు. తాను చనిపోతున్నట్లు స్నేహితులకు వాట్సాప్ (Whatsapp Message) ద్వారా సమాచరం అందించారు.
AR Constable | త్రినేత్ర.న్యూస్: ప్రేమ విఫలమవడంతో ఓ ఏఆర్ కానిస్టేబుల్ (AR Constable) ఆత్మహత్య చేసుకున్నారు. తాను చనిపోతున్నట్లు స్నేహితులకు వాట్సాప్ (Whatsapp Message) ద్వారా సమాచరం అందించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట (Amberpet) తిరుమలనగర్‌లో జరగింది.
తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ (25) పెట్లబుర్జు (Petlaburj) పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అతడు కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నారు. ఇద్దరి పెండ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన అతడు ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే తాను చనిపోతున్నానంటూ ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్ ద్వారా నిభాష్ (nibhash) సమాచారం అందించారు. అప్రమత్తమైన స్నేహితులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకునేలోపే కానిస్టేబుల్ ప్రాణాలు వదిలారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి
- ●New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

Arrest | క్యూర్ కోడ్ స్కాన్ చేసి.. నకిలీ స్క్రీన్ షాట్ చూపించి

New EHS | 921 ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ అమలు

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు





